Reading Time: < 1 minute

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు దుబాయ్‌లో చిక్కుకున్నారు. ఇజ్రాయిల్-ఇరాన్‌కు మధ్య జరుగుతున్న యుద్దంలో భాగంగా దుబా తోపాటు పలు గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రదాకార దాడులకు పాల్పడుతున్న నేపధ్యంలో విమనాశ్రాయాలను మూసివేయడంతో విమాన సర్వీస్ లు రద్దయ్యాయి. దీంతో తుమ్మల అక్కడ చిక్కుకుపోవాల్సి వచ్చింది. మంత్రి పెద్ద కుమార్తె డాక్టర్ మోహిని భర్త డాక్టర్ శేఖర్ డాక్టర్ల కాన్పరెన్స్‌లో పాల్గొనడానికి వారం రోజుల క్రితం దుబాయికి వెళ్లారు. కాన్ఫరెన్స్ అనంతరం హైదరాబాద్ కు తిరుగుప్రయాణంలో దుబాయి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న సయమంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ఈవిషయం తెలిసిన వెంటనే మంత్రి తుమ్మల తన కుటుంబసభ్యులతో కలిసి దుబాయ్ కి వెళ్లారు. అల్లుడికి ఆపరేషన్ అయి కోలుకుంటుండగా మంత్రి తుమ్మల ఇండియాకు వచ్చేందుకు

ఆదివారం దుబాయ్ ఎయిర్ పోర్టుకు వచ్చిన సమయంలో వైమానికి సేవలను నిలిపివేశారు. దీంతో ఆయన దుబాయ్ లోనే సురక్షిత ప్రాంతంలో ఉండిపోయారు. ఎయిర్ పోర్టు అధికారులు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు ఆయన అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం అధికారులతో తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. దుబాయిలో విమానాశ్రయం, ప్రముఖ హోటళ్ళపై, దుబాయ్ లో ఫేమస్ భవనం అయిన బుర్జ్ ఖలీఫా సమీపంలో బుర్జ్ అ అరబ్ పై సైతం క్షిపణులు, బాంబులు దాడి జరుగుతోంది. దుబాయ్ లో మంత్రి తుమ్మలతో పాటు చాలామంది తెలుగు వారు ,్ర పవాస భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సొంత అల్లుడి ఆరోగ్యం బాగాలేక దుబాయ్ కి వెళ్తితే కొంతమంది విదేశాల్లో విహార యాత్ర చేయడానికి వెళ్లారని విమర్శలు చేయడాన్ని తుమ్మల అనుచరులు తీవ్రంగా ఖండించారు.