Reading Time: < 1 minute

హోలీ పండగ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులను మూసివేయాలని సిపిలు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కల్లు దుకాణాలు, వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశించారు. సార్ట్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మినహాయింపు ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.