Reading Time: 2 minutes

 బాన్సువాడ ఘటనలో తెలంగాణ రాష్టంలో శాంతి భద్రత సమస్య ఉందని, రాహుల్ గాంధీ శిక్షణ శిబిరం కోసం వచ్చారు తప్ప ప్రజా సమస్యలపై కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీ కి మూటలు పంపవచ్చని సీ ఎం చెviతున్నాడని, తెలంగాణలో రాచరిక పాలన మొదలైందని విమర్శించారు. సోమవారం కామారెడ్డి బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇండ్ల ను కూల్చాడం, దేవాలయాలను కూల్చడం జరుగుతుందని, రాహుల్ గాంధీ పోవాల్సింది శిక్షణ శిబిరం కు కాదని హై డ్రా పేరు తో కూలిన ఇండ్ల వద్ద కు వెళ్లి పరామర్శించాలన్నారు. బాన్సువాడ లో జరిగిన సంఘటన హేయమైన చర్య అన్నారు. తెలంగాణలో దేవాలయాలపై దాడులను అరికట్టాలన్నారు. బాన్సువాడలో సామాన్యులు సామాన్లు తీసుకోవడానికి షాప్ కి వస్తే అమాయకులను పట్టుకుపోయి కేసులు చేసి రిమాండ్‌కు తరలించారన్నారు.తెలంగాణ లో హోమ్ మంత్రి లేరని, కాంగ్రెస్, ఎం ఐ ఎం పార్టీ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు.

బాన్సువాడలో జరిగిన ఘటన లో చట్ట పరంగా చర్యలు తీసుకోవలసిన పోలీసులు చట్టానికి కొమ్ముకాస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూవులను అరెస్ట్ చేశారని, ఎం ఐ ఎం పార్టీ ఆనందం చూడటానికి కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. కాంగ్రెస్, ఎం ఐ ఎం పార్టీ కి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని, దేవుళ్ళ మీద దాడి జరిగితే స్పందించక పొతే హిందువే కాదని, బాన్సువాడలో అరెస్ట్ చేస్తే కుటుంబ సభ్యులు కంటతడి పెడుతున్నారన్నారు. 4 కోట్ల ఇండ్లను బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పేదలకు అందచేశామని, హై డ్రా పేరు తో పేదల ఇండ్ల ను కూల్చివేస్తున్నారన్నారు. మూసీ పేరు తో పేదల ఇండ్లు కూలగాట్టారని, గాంధీ ఆత్మ కోసం పేదోడి ఇండ్ల ను కొట్టడం సరికాదన్నారు. ప్రజలు ఏడుస్తున్నారని, ఖమ్మం లో భూదాన్ భూముల పేరు తో 800 ఇండ్లు కూల్చి వేశారని, పేద విద్యార్థుల పరిస్థితి ఏంటని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం లో పేదలు భయపడుతూ బ్రతకల్సిన పరిస్థితి నెలకొంది. పేదల ఇండ్ల జోలికి వస్తే ఊరుకునే పరిస్థితి లేదన్నారు. గ్రామ పంచాయతీ జడ్పిటిసి, ఎం పి టి సి ఎన్నికల్లో ప్రజలు ఆలోచించలన్నారు. కార్యక్రమం లో ఎల్లారెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి పైడి ఎల్లారెడ్డి పాల్గొన్నారు.