
హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరారు. ఇండియన్ ఎంబసిల సూచనలతో పాటు ఆదేశాలను పాటించాలన్నారు. తెలంగాణ వాసుల పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామని, సురక్షితంగా ఇక్కడకు రప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్‌లపై ఇరాన్ దాడులు చేశాయి. ఇరాన్ దాడి సమయంలో ఇండియన్స్ ఆయిల్ ట్యాంకర్‌లో ఉన్నారు. ఇరాన్ దాడిలో నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. హర్‌మూజ్ జలసంధిలో ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసింది.
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్ నలువైపుల నుంచి దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఖమేనీ వ్యతిరేక వర్గాలు ఇరాన్‌లో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. నియంత శకం ముగిసిందంటూ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పివి సింధు ఇరాన్ యుద్ధం వల్ల దుబాయ్‌లో చిక్కుకుపోయింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆమెను హోటల్‌కు తరలించారు. హోటల్‌లో పివి సింధు సురక్షితంగా ఉన్నారు. యూకేలో జరుగుతున్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్-2026కు వెళ్తుండగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి.