
నల్గొండ: వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, ఆ మురిపెం పట్టుమని మూడు నెలలు కూడా ఉండలేదు. ఏమైందో తెలియదు కానీ, భార్యని భర్త దారుణంగా హత్య చేసి చంపేశాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం గూడూరులో చోటు చేసుకుంది. భర్త తవీర్ భార్య మనీషా చారును దారుణంగా హత్య చేశాడు. మూడు నెలల క్రితమే మనీషా-తవీర్‌లు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం మనీషా-తవీర్ దంపతులు ఒడిశా నుంచి ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. గూడూరులోని ఓ ఇటుక బట్టీలో వీరిద్దరు పని చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.