Reading Time: 2 minutes
India Playing Xi Vs Zimbabwe Sanju Samson Set To Play Axar Patel In Tilak Varma Demoted T20 World Cup 2026

IND Playing XI vs ZIM in T20 World Cup 2026 Super 8 Match: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 కీలక మ్యాచ్‌లో జింబాబ్వేను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 26న చెన్నై చెపాక్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు ఈ మ్యాచ్‌లో భారీ విజయమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో జట్టు కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఓపెనింగ్ నుంచి బౌలింగ్ వరకూ అద్భుత ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఉంది. టీమిండియా ప్లేయింగ్ 11పై ఓసారి చూద్దాం.

టీమిండియా ఫినిషర్ రింకూ సింగ్‌ కుటుంబ కారణాలతో ఉన్నపళంగా జట్టును వీడాల్సి వచ్చింది. దాంతో టాప్ ఆర్డర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు లైన్ క్లియర్ అయింది. జింబాబ్వేపై సంజూ ఆడడం దాదాపుగా ఖాయం అయింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరూ అటాకింగ్ బ్యాటర్లు కావడంతో పవర్‌ప్లేలోనే భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుందని టీమ్ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరు సెటిల్ అయితే జింబాబ్వే బౌలర్లపై మొదటి నుంచే ఒత్తిడి పెంచనున్నారు. మూడో స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఆడించాలని కెప్టెన్ చూస్తున్నాడట. ఇన్నింగ్స్‌ను కంట్రోల్ చేయడంతో పాటు అవసరమైనప్పుడు వేగం పెంచే సామర్థ్యం కిషన్‌కు ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం.

Also Read: Salman Ali Agha: బాగా ఆడాం, రోజు అల్లాహ్ మా వైపు లేడు.. ఇంగ్లాండ్‌ ఓటమిపై పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

నాలుగులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు. మూడో స్థానంలో ఆడే తిలక్ వర్మకు డిమోషన్ తప్పదు. అతడు ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్‌లో సూర్య, తిలక్‌తో పాటు హార్దిక్ పాండ్య ఆడనున్నారు. ఫినిషింగ్ బాధ్యతలను శివమ్ దూబే చూసుకుంటాడు. ఆల్‌రౌండ్ విభాగంలో వాషింగ్టన్ సుందర్ బదులుగా అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పిన్ అటాక్‌లో వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నాడు. చెన్నై పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం కాబట్టి కుల్దీప్ యాదవ్‌కు కూడా చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు. కుల్దీప్ జట్టులో ఉంటే అర్షదీప్ సింగ్‌పై వేటు పడుతుంది. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా ఆడుతాడు. ఇది సాధారణ మ్యాచ్ కాదు, సెమీస్ ఆశలను నిర్ణయించే కీలక పోరు. అందుకే టీమ్ మేనేజ్‌మెంట్ ఎంచుకునే ప్లేయింగ్ XIపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

భారత్ తుది జట్టు (అంచనా):
సంజూ శాంసన్‌, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌/అర్షదీప్ సింగ్‌, జస్ప్రీత్ బుమ్రా.