Reading Time: < 1 minute
Gold And Silver Rates Today 85

అంతర్జాతీయంగా గందరగోళం నెలకొనడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్న తరుణంలో బంగారం, వెండి ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. ఈరోజు బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర భారీ ఉపశమనం కలిగించింది. దీంతో పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.110 పెరగగా.. వెండి ధర యథాతథంగా ఉంది.

ఇది కూడా చదవండి: Trump: నేను లేకుంటే పాక్ ప్రధాని షరీఫ్ చనిపోయేవాడు.. ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

తులం గోల్డ్‌పై రూ.110 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,61,890 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.100 పెరగడంతో రూ.1,48,400 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.80 పెరగడంతో రూ.1,21,420 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Trump: భారత్ టార్గెట్‌గా ట్రంప్ మరో దాడి.. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకాలు విధింపు

ఈరోజు సిల్వర్ ధర శాంతించింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,85, 000 దగ్గర అమ్ముడవుతోంది. అలాగే హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,95,000 దగ్గర కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి రూ.2,85, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.