Reading Time: < 1 minute

Si Yugandhar Trailer: వరుస హత్యలు.. హంతకుడు ఎవరు? ఉత్కంఠ రేపుతున్న ‘ఎస్ఐ యుగంధర్’ ట్రైలర్

Caption of Image.

వరుస హత్యల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అసలు ఈ హత్యలకు కారణమెవరు? నేరస్తుడిని పట్టుకునే క్రమంలో పోలీస్ ఆఫీసర్‌కు ఎదురైన సవాళ్లేంటి? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం చూపిస్తూ ‘ఎస్ఐ యుగంధర్’ ట్రైలర్ ఉత్కంఠ రేపుతోంది. క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ అంశాలతో రూపొందిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

‘శంభాలా’ తర్వాత ఆది సాయికుమార్ మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘ఎస్ఐ యుగంధర్’లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన కనిపించనున్నారు. ట్రైలర్‌లో ఆయన లుక్, యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వరుస హత్యల చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇక విలన్‌గా రైటర్ రాకేందు మౌళి కనిపించడం కూడా ఆసక్తిని కలిగిస్తోంది.

►ALSO READ | Comrade Kalyan Song: ‘ఎత్తర ఎత్తు పిడికిలి ఎత్తు’.. శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ లిరికల్ సాంగ్ రిలీజ్!

ఆది సాయికుమార్ హీరోగా, మేఘలేఖ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి యశ్వంత్ దర్శకత్వం వహించారు. ప్రదీప్ జూలూరు నిర్మించారు. ప్రణవ్ గిరిధరన్ సంగీతం అందించారు. అక్టోబర్ 2న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ వరుస హత్యల వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? ఎస్ఐ యుగంధర్ దాన్ని ఎలా ఛేదించాడు? అన్నది తెలియాలంటే అక్టోబర్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే!

©️ VIL Media Pvt Ltd.