Reading Time: < 1 minute

Golden Bhagyam Glimpse: సత్య, యోగిబాబు కాంబోలో ‘గోల్డెన్ భాగ్యం’.. టైటిల్ గ్లింప్స్ పిచ్చెక్కిస్తోంది..

Caption of Image.

‘రంగబలి’ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవన్ బసంశెట్టి ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి కామెడీ స్టార్స్ సత్య, యోగిబాబులను హీరోలుగా పెట్టి ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు ‘గోల్డెన్ భాగ్యం’ (GOLDEN BHAGYAM) అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేస్తూ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. గ్లింప్స్‌లో సత్య, యోగిబాబు తమదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. మాస్, కామెడీ, లవ్, యాక్షన్ అంశాలతో కట్ చేసిన ఈ గ్లింప్స్‌ మరింత ఆసక్తి పెంచుతుంది. 

‘రంగబలి’లో కామెడీ సన్నివేశాలను తెరకెక్కించిన విధానం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్.. ఈసారి సత్య, యోగిబాబు కాంబినేషన్‌తో మరో ఫ్రెష్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలు.. ఈ టైటిల్ గ్లింప్స్‌తో మరింత పెరిగాయి.

ఈ చిత్రాన్ని దర్శకుడు పవన్ బసంశెట్టి, నాగర్జున రెడ్డితో కలిసి స్వయంగా కో-ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘రంగబలి’కి సంగీతం అందించిన పవన్ సీహెచ్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు ఆయన అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

►ALSO READ | Si Yugandhar Trailer: వరుస హత్యలు.. హంతకుడు ఎవరు? ఉత్కంఠ రేపుతున్న ‘ఎస్ఐ యుగంధర్’ ట్రైలర్

మరోవైపు సత్య, యోగిబాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సత్య ఇటీవల ‘జెట్లీ’ సినిమాతో హీరోగా ప్రేక్షకులను పలకరించారు. అంతకుముందు ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీలో కీలక పాత్రలో నటించి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. దీంతో సత్యతో సినిమాలు చేసేందుకు దర్శకులు ఆసక్తి చూపుతున్నారు.

ఇక యోగిబాబు తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. హీరోగానూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్య, యోగిబాబు కలిసి నటిస్తున్న ‘గోల్డెన్ భాగ్యం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

©️ VIL Media Pvt Ltd.