Reading Time: < 1 minute
Dhanush Politics Buzz Grows After Kanimozhis Dig At Vijay Using Vip Film

Dhanush: తమిళ రాజకీయాల్లో ‘‘ధనుష్’’ పొలిటికల్ ఎంట్రీ వార్త హాట్‌హాట్‌గా మారింది. ముఖ్యమంత్రి విజయ్‌ను టార్గెట్ చేస్తూ.. డీఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధారాపురం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. విజయ్ ఎన్నికల హామీలను ప్రస్తావిస్తూ .. ‘‘వేలైయిలై పట్టాధారిలకు రూ. 4000 వచ్చాయా? రాలేదు. కానీ వేలయిల్ల పట్టాధారీ(VIP) సినిమాలో నటించిన ధనుష్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చేశారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ధనుష్ నటించిన వీఐపీ సినిమాను ప్రస్తావిస్తూ కనిమొళి ఈ వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం గ్రాడ్యుయేట్లకు నెలకు రూ. 4000 ఇస్తానని ఇచ్చిన హామీపై ఆమె సెటైర్లు గుప్పించారు.

జూలైలో అభిమానుల కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ.. అభిమానుల ఐక్యత కేవలం సినిమా వేడుకల వరకే పరిమితం చేయకుండా సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ప్రజల అవసరాలను తెలుసుకుని వారి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలను పెంచాయి. ఇటీవల జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకల్లో మీడియా ధనుష్‌ను ‘‘మీరు ఎప్పుడు రాజకీయాల్లో వస్తున్నారు.?’’ అని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లారు.