Reading Time: < 1 minute
Nani Srikanth Odela Paradise Movie Climax Megastar Chiranjeevi Multiverse Leak

‘దసరా’ లాంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పారడైజ్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని ఒక భారీ మల్టీవర్స్‌కు తెరలేపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నాని సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న లీక్ ఏంటంటే… ఈ రెండు సినిమాలకు ఒక స్ట్రాంగ్ ఇంటర్‌లింక్ ఉందట. ‘పారడైజ్’ సినిమా ముగిసే సమయానికి, క్లైమాక్స్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ లీడ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అంటే నాని సినిమాలోంచే చిరంజీవి క్యారెక్టర్ లేదా కథ పుట్టబోతోందన్నమాట! లోకేష్ కనగరాజ్ ‘LCU’ తరహాలోనే శ్రీకాంత్ ఓదెల కూడా తనదైన శైలిలో ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతోంది.

ట్విస్ట్‌లు ఇక్కడితోనే అయిపోలేదు. ‘పారడైజ్’ కథ కేవలం ఒక భాగంతో ముగిసిపోయేది కాదట. ఈ సినిమాకు ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలయ్యాక వచ్చే రెస్పాన్స్ ఆధారంగా ఈ ప్రీక్వెల్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే యోచనలో సినిమా టీం ఉందట. ఒకవేళ ఇదే నిజమైతే.. నాని క్లైమాక్స్ ఇచ్చే హైప్, చిరంజీవి సినిమాపై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోవడం ఖాయం. శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేస్తున్న ఈ మాస్టర్ మైండ్ గేమ్ టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!