Reading Time: < 1 minute

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలంటూ రాస్తారోకో

Caption of Image.

కోల్​బెల్ట్​,వెలుగు:  కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, ఏఐటీయూసీ శ్రేణులు ఆందోళన చేశారు . సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి ఎక్స్‌‌‌‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మన్, టౌన్ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను నియంత్రించడంలో విఫలమైందని విమర్శించారు.

పెట్రో ధరల పెరుగుదలతో రవాణా, వాణిజ్య రంగాలపై భారం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. గ్యాస్ పెంపుతో హోటల్ వ్యాపారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.