July 16, 2026

Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..

Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
Reading Time: < 1 minute
Mojtaba Khamenei Warning Us Persian Gulf No America Future

Mojtaba Khamenei: ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు కూడా సవాల్‌లు, ప్రతిసవాల్‌లు విసురుకుంటున్నాయి. తాజాగా, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికాపై విరుచుకుపడ్డారు. ఆయన లిఖితపూర్వక సందేశాన్ని ఇరాన్ స్టేట్ మీడియా చదివి వినిపించింది. ఇరాన్‌తో అణు ఒప్పందం కుదిరే వరకు హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే మొజ్తబా నుంచి ఈ వార్నింగ్ వచ్చింది.

Read Also: Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ఇరాన్ తన అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ సంపదగా పరిరక్షించుకుంటుందని ఖమేనీ పేర్కొన్నారు. అమెరికాపై తీవ్ర విమర్శలు చేస్తూ.. అమెరికాకు పర్షియన్ గల్ఫ్‌లో చివరిస్థానం సముద్రం అడుగుభాగం అంటూ వ్యాఖ్యానించారు. ‘‘దైవ సహాయంతో శక్తితో పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ఉజ్వల భవిష్యత్తు అమెరికా లేని భవిష్యత్తుగా ఉంటుంది. అది ఇక్కడి ప్రజల పురోగతి, సౌఖ్యం, శ్రేయస్సుకు సేవ చేసేదిగా ఉంటుంది’’ అని ఖమేనీ తన ప్రకటనలో పేర్కొన్నారు.

పర్షియన్ గల్ప్, ఒమన్ గల్ఫ్ జలాల అవతలి వైపున ఉన్న ఇరాన్, మా పొరుగు దేశాలు ఒకే విధిని పంచుకుంటున్నాయని, వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి దురాశ, దురుద్దేశంతో వ్యవహరించే విదేశీయులకు ఈ ప్రాంతంలో ఎలాంటి స్థానం లేదని, కేవలం దానికి మిగిలేది సముద్రపు అడుగు భాగమే అని ఖమేనీ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు.