
ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిల్ పోల్స్ వెల్లడవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో తుది దశ ఎన్నికలు ముగియడంతో బుధవారం (ఏప్రిల్ 29. 2026 న)ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి ఆయా సంస్థలు. తమిళనాడులో మరోసారి డీఎంకే అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు గాను డీఎంకే కూటమి 122 నుంచి 132 స్థానాలు, ఏఐఏడీఎంకే కూటమి 87 నుంచి110 సీట్లు, విజయ్ టీవీకే పార్టీ 18నుంచి 24 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నాయి.
మ్యాజిక్ ఫిగర్ 117
పీపుల్స్ పల్స్ సర్వే :
పీపుల్స్ పల్స్ సర్వే
డీఎంకే కూటమికి 125 నుంచి 145 స్థానాలు
ఏడీఎంకేకు 65 నుంచి -80 స్థానాలు
విజయ్ పార్టీ టీవీకేకు 18- నుంచి 24 స్థానాలు
మ్యాట్రిక్స్ సర్వే ఎగ్జిట్ పోల్స్ :
డీఎంకే కూటమి: 122 నుంచి 132 స్థానాలు
ఏఐఏడీఎంకే కూటమి: 87 నుంచి110 సీట్లు
విజయ్ పార్టీ (టీవీకే) :1 నుంచి 6 స్థానాలు గెలిచే అవకాశం ఉందని మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే స్పష్టం చేస్తుంది.
P MARQ ఎగ్జిట్ పోల్స్ సర్వే :
డీఎంకే కూటమి: 125 నుంచి 145 స్థానాలు
ఏఐఏడీఎంకే (బీజేపీ) కూటమి: 65 నుంచి 85 సీట్లు
విజయ్ పార్టీ (టీవీకే): 16 నుంచి 32 స్థానాలు
ఓట్ వైబ్ ఎగ్జిట్ పోల్స్ సర్వే..
డీఎంకే కూటమి: 103 నుంచి 113 స్థానాలు
ఏఐఏడీఎంకే (బీజేపీ) కూటమి: 114 నుంచి 124 సీట్లు
విజయ్ పార్టీ (టీవీకే) :4 నుంచి 10 స్థానాలు
ఓట్ వైబ్ ఎగ్జిట్ పోల్స్ సర్వే.. అన్నాడీఎంకే, బీజేపీ కూటమిదే విజయం అని చెబుతోంది.
యాక్సిస్ మై ఇండియా సర్వే..
డీఎంకే కూటమి: 92నుంచి 110స్థానాలు
ఏఐఏడీఎంకే (బీజేపీ) కూటమి: 22నుంచి 32సీట్లు
విజయ్ పార్టీ (టీవీకే): 98 నుంచి 120స్థానాలు
చాణక్య స్ట్రాటజీస్..
డీఎంకే కూటమి: 145నుంచి 165స్థానాలు
ఏఐఏడీఎంకే (బీజేపీ) కూటమి: 50నుంచి 65సీట్లు
విజయ్ పార్టీ (టీవీకే): 0స్థానాలు
ఇతరులు: 18 నుంచి 26 స్థానాలు