
వన్‌ప్లస్ చైనాలో ఏస్ 6 సిరీస్‌లో మూడో మోడల్‌గా వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రాను అధికారికంగా విడుదల చేసింది. 8600mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లేతో గేమింగ్ ఫోన్. ఈ ఫోన్ పనితీరు, గేమింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి రూపుదిద్దారు. ఇది వన్‌ప్లస్ ఏస్ 6, ఏస్ 6Tతో కలిసి సిరీస్‌ను పూర్తి చేస్తోంది. వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా ధరలు (చైనా మార్కెట్)
12GB RAM + 256GB : CNY 3,499 (సుమారు రూ.48,400)
12GB RAM + 512GB : CNY 3,799 (సుమారు రూ.52,500)
16GB RAM + 256GB : CNY 4,099 (సుమారు రూ.56,700)
16GB RAM + 512GB : CNY 4,399 (సుమారు రూ.60,800)
16GB RAM + 1TB : CNY 5,099 (సుమారు రూ.70,500)
వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా ముఖ్య స్పెసిఫికేషన్లు
డిస్‌ప్లే: 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే (BOE LTPS ప్యానెల్), 165Hz వరకు రిఫ్రెష్ రేట్, గరిష్ట బ్రైట్‌నెస్ 1800 నిట్స్ వరకు, అధిక టచ్ సాంప్లింగ్ రేట్ (4000Hz వరకు)
ప్రాసెసర్: MediaTek Dimensity 9500 చిప్‌సెట్ (ఫ్లాగ్‌షిప్ లెవల్ పనితీరు)
ర్యామ్ & స్టోరేజ్: 12GB / 16GB LPDDR5X RAM, 256GB నుంచి 1TB వరకు UFS 4.1 స్టోరేజ్
కెమెరా:రియర్: 50MP ప్రైమరీ సెన్సర్ (OIS + AF) + 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ (112° FOV)
ఫ్రంట్: 16MP సెల్ఫీ కెమెరా
4K వీడియో రికార్డింగ్ 60fps వద్ద, 20x డిజిటల్ జూమ్
బ్యాటరీ: ob 8600mAh బ్యాటరీ (డ్యూయల్ సెల్), 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఇతర ఫీచర్లు: Android 16 ఆధారిత ColorOS 16, అండర్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, హై-రెసిస్టెంట్ బిల్డ్ (IP69K రేటింగ్ వరకు)
గేమింగ్ కంట్రోలర్ కూడా విడుదల
వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రాతో పాటు ‘Gun God’ గేమింగ్ కంట్రోలర్ ను కూడా పరిచయం చేసింది. ఈ కంట్రోలర్ ధర CNY 449 (సుమారు రూ.6,200). ఎర్గోనామిక్ డిజైన్‌తో దీర్ఘకాలిక గేమింగ్‌కు సౌకర్యవంతంగా ఉండేలా తయారు చేశారు. ఫోన్‌కు అడ్డంగా అటాచ్ చేసి ఉపయోగించవచ్చు. వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా ప్రస్తుతం చైనా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. గ్లోబల్ లేదా భారతదేశ మార్కెట్‌లో విడుదల గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.