
Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad, IPL 2026 Live Score Updates: ఐపీఎల్ 19వ సీజన్ నేడు ప్రారంభమవుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరు సొంత మైదానమైన ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ రాత్రి 7:00 గంటలకు జరుగుతుంది.
గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి బెంగళూరు తమ తొలి టైటిల్‌ను గెలుచుకుంది. మరోవైపు, హైదరాబాద్ ఆరో స్థానంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.
రెండు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, రజత్ పాటిదార్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలామ్, రసిఖ్ సలామ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్.