కావాల్సిన పదార్దాలు: పచ్చి చింతకాయలు నాలుగు , ఉల్లిపాయలు ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, రెండు ఎండు మిర్చి, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, తరిగిన బెల్లం తీసుకోవాలి.
చింతపండు రసం ఇలా తయారు చేసుకోవాలి : ముందుగా పచ్చి చింతకాయలను తీసుకుని వాటిని నీళ్లలో బాగా నానబెట్టి, దాని నుంచిఒకటి లేదా రెండు గ్లాస్ లు చింత రసం తీసి ఒక గిన్నెలో కానీ, పాత్రలో కానీ పెట్టాలి. ఇది మీరు ముందే ప్రిపేర్ చేసుకోవాలి.
చింతపండు రసం మిశ్రమం: పచ్చి చింతపండు రసం తీసుకుని దానిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు , రుచికి సరిపడ్డాయా బెల్లం, రుచికి తగినంత ఉప్పు, అర కట్ట కొత్తిమీర ఆకులు వేసి మిక్స్ అయ్యేలా వాటిని బాగా కలుపుకోవాలి.
తాలింపు లేదా పోపు పెట్టుకోవాలి: ఇక ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి వేరే పాన్ పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి అది వేడయ్యాక, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు, ఇంగువతో పోపు పెట్టుకుని,
దానిని పచ్చి చింతపండు రసం మిశ్రమంలో కలపాలి.
పచ్చి చింతకాయలతో చేసిన రసం ఒకసారి తాగితే మళ్ళీ మళ్ళీ చేసుకుని తాగుతారు ఇవి అంత రుచిగా ఉంటాయి. అయితే, వాటిని బాగా ఉడకబెట్టి గుజ్జు వేరు చేసి రసం పెట్టుకుంటే ఏ నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసుకోండి.
రుచి అద్భుతంగా ఉంటుంది.




