July 15, 2026

Akshay Kumar: “అది ఒక అడల్ట్ సినిమా”.. ధురంధర్-2పై అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Akshay Kumar: “అది ఒక అడల్ట్ సినిమా”.. ధురంధర్-2పై అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Reading Time: 2 minutes
Akshay Kumar Comments Dhurandhar The Revenge Vs Bhoot Bangla

Akshay Kumar: బాక్సాఫీస్‌ వద్ద రణవీర్ సింగ్ నటించిన ‘ ధురందర్: ది రివెంజ్’ చిత్రం దూసుకుపోతోంది. ఈ చిత్రం కొత్త రికార్డులను నెలకొల్పుతూ విమర్శకులు, అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాల నుంచి విస్తృత ప్రశంసలను అందుకుంటోంది. తాజాగా నటుడు అక్షయ్ కుమార్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశంసించడంతో పాటు, తన రాబోయే హారర్ కామెడీ చిత్రం ‘భూత్ బంగ్లా’తో పోటీపై స్పందించాడు. ధురంధర్ ఒక అడల్ట్ సినిమా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చి ఇంటర్వ్యూలో అక్షయ్ మాట్లాడుతూ.. “సినిమా ఇంత బాగా నడుస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది భారతీయ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లింది.” అని ప్రశంసించాడు.

READ MORE: Toyota Land Cruiser FJ: టయోటా అత్యంత చౌకైన ల్యాండ్ క్రూయిజర్ FJ విడుదల.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే?

ఇక తాను నటించిన ‘భూత్ బంగ్లా’, రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్: ది రివెంజ్’ల మధ్య వ్యాత్యాసాన్ని ఎత్తి చూశాడు అక్షయ్.. ఆ (ధురంధర్: ది రివెంజ్) సినిమా వాస్తవికతతో కూడినదన్నాడు. ఇది ఒక యాక్షన్‌తో కూడిన అడల్ట్ సినిమా అని తెలిపాడు. ధురంధర్ పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన సినిమా అని.. తన చిత్రం(భూత్ బంగ్లా) మాత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అభివృద్ధి చేసినట్లు తెలిపాడు. చిన్న పిల్లలు, పెద్ద అందరూ చూడొచ్చని వెల్లడించాడు. ఇక్కడ అక్షయ్ కుమార్ అభిప్రాయం ఏంటంటే.. ధురంధర్ -2 సినిమా చాలా అద్భుతంగా ఉంది. కానీ.. ఆ సినిమాను ఎక్కువగా పిల్లల కంటే పెద్దలు చూడటానికి ఇష్టపడతారని ఉద్దేశం. ఇక భూత్ బంగ్లా చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియదర్శన్, అక్షయ్ కుమార్, పరేష్ రావల్ అనే దిగ్గజ త్రయం కలిసి నటించారు. ఈ చిత్రంలో తబు, రాజ్‌పాల్ యాదవ్, మిథిలా పాల్కర్‌లతో పాటు ఇతర నటీనటులు సైతం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్‌ల బాలాజీ టెలిఫిల్మ్స్, అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించాయి. ఈ చిత్రానికి ఫారా షేక్, వేదాంత్ బాలి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. అక్షయ్ కుమార్, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అశ్రాని మరియు మనోజ్ జోషి నటించిన ‘భూల్ భులయ్యా’ (2007) తర్వాత ప్రియదర్శన్ నుంచి వస్తున్న రెండవ హిందీ హారర్ కామెడీ చిత్రం ఇది. ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది.

READ MORE: Supreme Court: మతం మారితే ఎస్సీ హక్కులు వర్తించవు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..