July 15, 2026

Anushka Sharma-Tollywood: అనుష్క శర్మ టాలీవుడ్ ఎంట్రీ.. కట్ చేస్తే.. !

Anushka Sharma-Tollywood: అనుష్క శర్మ టాలీవుడ్ ఎంట్రీ.. కట్ చేస్తే.. !
Reading Time: < 1 minute
Anushka Sharma Tollywood Entry Rumors Not Part Of Allu Arjun Atlee Film Clarifies Team

అట్లీ-అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌లో కేవలం బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణేను మాత్రమే కథానాయికగా రివీల్ చేశారు మేకర్స్. కానీ సినిమాలో ముగ్గురు, నలుగురు భామలకు స్కోప్ ఉందని వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో బన్నీ త్రీ ఫోర్ రోల్స్ చేస్తున్నాడని.. ఆ క్యారెక్టర్స్‌కు జోడీగా రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్‌ ఠాకూర్‌ను ఫిక్స్ చేశారని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఆ సినిమాలో నేను లేను మహా ప్రభో అని సీతా మహాలక్ష్మీ మొరపెట్టుకుంటున్నా.. ఆమె ఉందని డిసైడ్ అయిపోయారు క్రిటిక్స్ అండ్ ఆడియన్స్.

బన్నీ 22లోకి బాలీవుడ్ స్టార్ బ్యూటీ, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ నటించబోతుందని తాజాగా వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. అట్లీ- బన్నీ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుందన్న రూమర్స్ ఊపందుకున్నాయి. ప్రియాంక చోప్రా బాటలోనే టాలీవుడ్ బాటలో పయనించబోతున్నారని కథనాలు పుట్టించేశారు. కట్ చేస్తే.. అనుష్క ఈ మూవీలో పార్ట్ కావడం లేదని ఆమె పీఆర్ టీం స్ట్రాంగ్‌గా ఖండించినట్లు బీటౌన్ మీడియా చెబుతోంది.

Also Read: Rinku Singh: రింకు సింగ్‌కు కీలక పదవి.. ఆనందంలో ఫాన్స్!

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకుని.. సిల్వర్ స్క్రీన్‌కు గ్యాప్ ఇచ్చింది అనుష్క శర్మ. ప్రజెంట్ చిల్డ్రన్ కేర్ లీవ్స్ ఎంజాయ్ చేస్తోంది. జీరో తర్వాత హీరోయిన్‌గా కనిపించలేదు. మరో వైపు ఎన్‌హెచ్ 10, పరి, బుల్బుల్ చిత్రాలతో నిర్మాతగానూ ఫ్రూవ్ చేసుకున్న అనుష్క.. మళ్లీ ఏ మూవీని ఫైనాన్ష్ చేయలేదు. అలాగే నెట్ ఫ్లిక్స్ కోసం తెరకెక్కించిన చక్దా ఎక్స్ ప్రెస్ మూవీ కూడా పోస్ట్ పోన్ అవుతోంది. క్రికెటర్ జులెన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ 2022లోనే కంప్లీట్ చేసుకున్నప్పటికీ.. విడుదలకు నోచుకోవడం లేదు. ఇక తాజా రూమర్ చూస్తే.. అనుష్క కెరీర్‌పై తన కన్నా ఆడియన్సే ఎక్కువగా కాన్సట్రేషన్ చేస్తున్నట్లున్నారు.