July 13, 2026

Swastik Chikara: ఐపీఎల్ 2026 అవకాశం మిస్ చేసిన RCB.. అయోధ్యలో స్వస్తిక్ చికారా 21 సిక్సర్ల సాయంతో 195*తో రివెంజ్..

Swastik Chikara: ఐపీఎల్ 2026 అవకాశం మిస్ చేసిన RCB.. అయోధ్యలో స్వస్తిక్ చికారా 21 సిక్సర్ల సాయంతో 195*తో రివెంజ్..
Reading Time: 2 minutes
Swastik Chikara 195 Of Just 69 Balls Smashing 21 Sixes In Ayodhya Premier League

అయోధ్య ప్రీమియర్ లీగ్ T20 టోర్నమెంట్‌లో మరోసారి క్రికెట్ ప్రపంచం షాక్ అయింది. మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాడు స్వస్తిక్ చికారా గోమతి థండర్ తరపున హిండోన్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 195 పరుగులు (69 బంతుల్లో) చేశాడు. ఇందులో 21 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అద్భుతంగా 282.61 ఉంది. ఇది T20లో అత్యంత విధ్వంసకర ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది. చికారా డబుల్ సెంచరీ (200)కి కేవలం 5 రన్స్ దూరంలో ఉన్నాడు. చివరి 5 బంతుల్లో స్ట్రైక్ తీసుకుని 6, 6, 4, (డాట్), 6 అని ఆడి 195* వద్ద ఆగాడు.

Also Read:10 Million Rial Note: ఇరాన్ 10 మిలియన్ నోట్ విడుదల.. భారత కరెన్సీలో ఆ విలువ ఎంతో తెలుసా..?

ఐపీఎల్ 2026కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్వాస్తిక్ చికారాను విడుదల చేసింది. అతను గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, ఐపీఎల్ 2026 మినీ-వేలంలో కూడా అతన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే, అయోధ్య ప్రీమియర్ లీగ్‌లో 195 పరుగులు చేసి అతను అన్ని ఫ్రాంచైజీలకు గట్టి సమాధానం ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో స్వాస్తిక్ చికారా 21 భారీ సిక్సర్లు కొట్టాడు. ఈ 20 ఏళ్ల యువ బ్యాటర్ తన టాలెంట్‌ను బయటపెట్టాడు.

అయోధ్య ప్రీమియర్ లీగ్ మ్యాచ్ గోమతి థండర్, హిండన్ టైటాన్స్ జట్ల మధ్య జరుగుతోంది. గోమతి థండర్ మొదట బ్యాటింగ్ చేసింది. స్వస్తిక్ చికారా, ప్రియాంశు పాండే క్రీజులోకి వచ్చి 307 పరుగుల అద్భుత భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను ముగించారు. ప్రియాంశు పాండే 54 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. స్వస్తిక్ చికారా 69 బంతుల్లో 11 ఫోర్లు, 21 భారీ సిక్సర్లతో 195 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

Also Read:Assembly Elections : ఐదు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎలక్షన్ హీట్

చికారా 282.6 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఇంతకు ముందు ఏ బ్యాట్స్‌మెన్ కూడా 195 పరుగుల ఇన్నింగ్స్ ఆడలేదు. ఈ ఇన్నింగ్స్‌లో అతను అన్ని దిశల్లోనూ భారీ షాట్లు ఆడాడు. ఈ మ్యాచ్‌లో గోమతి జట్టు 20 ఓవర్లలో 308 పరుగులు చేసింది. బరిలోకి దిగిన హిండన్ టైటాన్స్ కేవలం 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వస్తిక్ చికారా బౌలింగ్‌లో హిండన్ జట్టు ఒంటరిగా ఓడిపోయింది.