Reading Time: < 1 minute

ఈ కుర్రాడికి పెళ్లి ఫిక్స్ అయ్యింది.. ఉద్యోగ ప్రయత్నాలు విఫలం కావడంతో..

Caption of Image.

కొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం హైదరాబాద్ లో కలకలం రేపింది. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ.. ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండే వ్యక్తి చనిపోవడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లిలో జరిగిన ఈ ఘటన గురించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

శివరాం పల్లి వికర్ సెక్షన్ కాలనీలో సిద్ధార్థ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం (మార్చి 22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. పెళ్లి నిశ్చయమైన కొన్ని రోజుల్లోనే ఇలాంటి దుర్ఘటన జరగడంతో  కుటుంబ సభ్యులు దు:ఖ సంద్రంలో మునిగిపోయారు.

సిద్ధార్థ్ ఎవరితోనూ గొడవలు పెట్టుకునే వ్యక్తి కాదని, ఎప్పుడూ ఉద్యోగం గురించే ఆలోచించేవాడని మృతుడి తమ్ముడు తెలిపాడు. ఉద్యోగం రాకపోవడం వల్లే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.  అత్తాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.