Reading Time: < 1 minute
Anushka Shetty Team Denies Marriage Rumors Slams Age Shaming

Anushka Shetty: టాలీవుడ్ ‘జెజమ్మ’ అనుష్క శెట్టి త్వరలో ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నారంటూ నెట్టింట జరుగుతున్న ప్రచారానికి ఆమె టీమ్ చెక్ పెట్టింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూనే, వ్యక్తిగత జీవితాన్ని సెన్సేషనలైజ్ చేయడంపై ఘాటుగా స్పందించింది. అనుష్క వ్యక్తిగత జీవితాన్ని ప్రతిరోజూ హెడ్‌లైన్స్‌లోకి తీసుకురావడం సరైన పద్ధతి కాదని ఆమె టీమ్ పేర్కొంది. “అనధికారిక సమాచారాన్ని పదే పదే ప్రచురించడం అన్యాయం. అన్నిటికంటే నిరాశ కలిగించే విషయం ఏమిటంటే.. ఆమె వయసును (44) ప్రతి పోస్ట్‌లోనూ ఒక వివాదాస్పద అంశంలా హైలైట్ చేయడం. హీరోల వయసు విషయంలో చూపని ఉత్సాహం, కేవలం హీరోయిన్ల విషయంలోనే ఎందుకు కనిపిస్తోంది?” అని టీమ్ ప్రశ్నించింది.

READ ALSO: Dhurandhar 2: అసలైన ‘ధురందర్’ రణవీర్ కాదు.. సినిమాలో ఊహించని మలుపు.. అభిమానులు షాక్!

అనుష్క తన కెరీర్‌ను కేవలం ప్రతిభతో, ఎంతో హుందాగా నిర్మించుకున్నారని, ఆమె ఎప్పుడూ పీఆర్ స్టంట్స్‌పై ఆధారపడలేదని ఆమె టీమ్ ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. తన పర్సనల్ లైఫ్‌ను గోప్యంగా ఉంచుకోవాలని కోరుకునే వ్యక్తిని ఇలా టార్గెట్ చేయడం సమంజసం కాదని హితవు పలికారు. “వివాహం అనేది ఒక వ్యక్తిగత విషయం. అది బ్రేకింగ్ న్యూస్ కాదు, కేవలం వ్యూస్ కోసం వాడాల్సిన అంశం అంతకంటే కాదు. ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి. ఒక వార్తను ప్రచురించే ముందు నిజాన్ని నిర్ధారించుకోండి. హీరోయిన్లను కూడా హీరోలతో సమానంగా, గౌరవంగా చూడటం నేర్చుకోండి” అని అనుష్క టీమ్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది.

READ ALSO: Stock Market: 5 నిమిషాల్లో రూ.8 లక్షల కోట్ల లాస్.. పేకమేడలా కుప్పకూలిన స్టాక్ మార్కెట్!