July 12, 2026

Tsutomu Shibayama: తరాల జ్ఞాపకం.. డోరేమాన్ సృష్టికర్త కన్నుమూత.. యానిమేషన్ లోకంలో తీరని లోటు

Tsutomu Shibayama: తరాల జ్ఞాపకం.. డోరేమాన్ సృష్టికర్త కన్నుమూత.. యానిమేషన్ లోకంలో తీరని లోటు
Reading Time: < 1 minute
Tsutomu Shibayama Doraemon Director Passes Away 84

Tsutomu Shibayama: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులను తన యానిమేషన్‌తో అలరించిన ప్రముఖ దర్శకుడు షిబాయామా సుటోము (84) ఇక లేరు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, మార్చి 6న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సహ-వ్యవస్థాపకుడిగా ఉన్న ‘అజియా-డో యానిమేషన్ వర్క్స్’ స్టూడియో మార్చి 17, 2026న అధికారికంగా ప్రకటించింది.

READ ALSO: Dhurandhar2 : ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఈ రోజు కూడా షోలు రద్దు!

20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం
షిబాయామా సుటోము పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ‘డోరేమాన్’. 1979లో ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించడం ప్రారంభించిన ఆయన, దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. కేవలం టీవీ సిరీస్‌నే కాకుండా, డోరేమాన్ ఫ్రాంచైజీలో వచ్చిన 22 ఫీచర్ చిత్రాలకు కూడా ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. జపాన్‌లో ఆయనను గౌరవపూర్వకంగా “జాతీయ యానిమేషన్ పితామహుడు” అని పిలుచుకుంటారు.

కెరీర్ విశేషాలు..
1963లో టోయీ యానిమేషన్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించారు షిబాయామా సుటోము. డోరేమాన్‌తో పాటు చిబీ మారుకో చాన్, లూపిన్ III, కైకెట్సు జోరోరి వంటి హిట్ సిరీస్‌లకు పనిచేశారు. 1978లో ఒసాము కోబయాషి – మిచిషిరో యమడాలతో కలిసి అజియా-డో యానిమేషన్ వర్క్స్ సంస్థను స్థాపించారు. యానిమేషన్ రంగానికి ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా, 2012లో జపాన్ ప్రభుత్వం ఆయనను ‘జీవిత సాఫల్య పురస్కారం’తో సత్కరించింది.

అంత్యక్రియలు పూర్తి
కుటుంబ సభ్యుల కోరిక మేరకు షిబాయామా అంత్యక్రియలు అత్యంత ప్రైవేటుగా నిర్వహించినట్లు స్టూడియో తెలిపింది. అందుకే ఆయన మరణవార్తను ఆలస్యంగా వెల్లడించినట్లు పేర్కొంది. త్వరలోనే అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక స్మారక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

READ ALSO: Dhurandhar 2: రణవీర్ సింగ్ నటనకు ఐకాన్ స్టార్ ఫిదా.. ‘ధురంధర్ 2’ పై అల్లు అర్జున్ రివ్యూ వైరల్!