July 9, 2026

Unsold In PAK Players: ది హండ్రెడ్ 2026 ఆక్షన్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లకు నిరాశ.. షాదాబ్ ఖాన్, హారిస్ రౌఫ్ అన్‌సోల్డ్

Unsold In PAK Players: ది హండ్రెడ్ 2026 ఆక్షన్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లకు నిరాశ.. షాదాబ్ ఖాన్, హారిస్ రౌఫ్ అన్‌సోల్డ్
Reading Time: 2 minutes

Unsold In PAK Players: ది హండ్రెడ్ 2026 ఆక్షన్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లకు నిరాశ.. షాదాబ్ ఖాన్, హారిస్ రౌఫ్ అన్‌సోల్డ్

Caption of Image.

Unsold In PAK Players: ఇంగ్లాండ్‌లో నిర్వహిస్తున్న ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నమెంట్ ది హండ్రెడ్ 2026 సీజన్‌కు సంబంధించిన తొలి వేలం ఈరోజు ( మార్చి 12న) జరిగింది. ఈ వేలంలో పలువురు ప్రముఖ ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడయ్యారు. అయితే పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు షాదాబ్ ఖాన్, హరీస్ రౌఫ్ లను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు కూడా ముందుకు రాకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. దీంతో క్రికెట్ అభిమానుల్లో, సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ కొనసాగుతుంది. 

షాదాబ్ ఖాన్, హారిస్ రౌఫ్‌కు నిరాశ: 
పాకిస్తాన్ జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నప్పటికీ, దిహండ్రెడ్ వేలంలో వారిని కొనుగోలే చేసేందుకు ఏ ఫ్రాంచైజి కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. ముఖ్యంగా హారిస్ రౌఫ్ గతంలో ది హండ్రెడ్  టోర్నీలో 12 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీసి 6.8 ఎకానమీతో మంచి ప్రదర్శన ఇచ్చిన్నపట్పికీ.. ఈసారి అతని కోసం కనీసం ఒక బిడ్ కూడా దాఖలు కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీంతో సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు ఇది పాకిస్తాన్ ఆటగాళ్లపై వివక్ష కారణంగా జరిగిందని విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు మాత్రం తర్వాతి దశలో ఏదైనా జట్టు వారిని తీసుకునే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు. 

‘ది హండ్రెడ్’లీగ్ లో ఐపీఎల్ టీమ్స్ ప్రభావం: 
ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల యజమానులు కూడా ది హండ్రెడ్ టోర్నీలో భాగస్వాములయ్యారు. వీరి ఎంట్రీతో ఈ టోర్నమెంట్‌కు గ్లోబల్ వైడ్ గా ఆకర్షణ పెరిగింది.

* ముంబై ఇండియన్స్ – MI లండన్ జట్టుకు యజమానులు
* లక్నో సూపర్ జెయింట్స్ – మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌తో అనుబంధం
* సన్‌రైజర్స్ హైదరాబాద్ – సన్‌రైజర్స్ లీడ్స్‌తో అనుబంధం
* ఢిల్లీ క్యాపిటల్స్ – సదరన్ బ్రేవ్‌తో అనుబంధం

వేలంలో భారీ డీల్స్: 
* ఈ వేలంలో ఇంగ్లాండ్ వికెట్‌కీపర్ జోర్డాన్ కాక్స్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. అతడిని వెల్ష్ ఫైర్ జట్టు £300,000 (  ఇండియన్ కరెన్సీలో రూ. 3.7 కోట్లు)కు కొనుగోలు చేసింది. 
* టామ్ కరన్ ను MI లండన్ £260,000 ( ఇండియన్ కరెన్సీలో రూ. 3.2 కోట్లు) కు తీసుకుంది. 
* మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ని వెల్ష్ ఫైర్ £240,000 ( ఇండియన్ కరెన్సీలో రూ. 3.0 కోట్లు) కు సొంతం చేసుకుంది.
* ఇక అనుభవజ్ఞుడైన బ్యాటర్ జేమ్స్ విన్స్ ను MI లండన్ £190,000 ( ఇండియన్ కరెన్సీలో రూ. 2.3 కోట్లు) కు కొనుగోలు చేసింది. 
* మరో స్టార్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో ని లండన్ స్పిరిట్ £160,000 ( ఇండియన్ కరెన్సీలో రూ. 1.96 కోట్లు)కు తీసుకుంది.

పాక్ ప్లేయర్స్ కి అవకాశం ఉందా?: 
ఈ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన ఆటగాళ్లను టోర్నమెంట్ ప్రారంభానికి ముందు అవసరమైతే ఫ్రాంచైజీలు రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. దాంతో పాకిస్తాన్ ప్లేయర్లు షాదాబ్ ఖాన్, హారిస్ రౌఫ్‌లకు ది హండ్రెడ్ లీగ్ లో ఆడేందుకు ఇంకా అవకాశం ఉంది.  

 

 

©️ VIL Media Pvt Ltd.