July 10, 2026

Jasprit Bumrah: జస్‌ప్రీత్ బుమ్రా సంచలన నిర్ణయం.. టీ20లకి గుడ్ బై?

Jasprit Bumrah: జస్‌ప్రీత్ బుమ్రా సంచలన నిర్ణయం.. టీ20లకి గుడ్ బై?
Reading Time: 2 minutes

Jasprit Bumrah: జస్‌ప్రీత్ బుమ్రా సంచలన నిర్ణయం.. టీ20లకి గుడ్ బై?

Caption of Image.

Jasprit Bumrah: టీ20 ప్రపంచకప్ లో అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా..  తన యార్కర్లు, పదునైనా బంతులతో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బుమ్రా.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బుమ్రా నిర్ణయంపై ఫ్యాన్స్‌ షాక్ అయినట్లు తెలుస్తుంది. టీమిండియా భవిష్యత్తు ప్రణాళికలను చూస్తే ఇది ఒక మాస్టర్ ప్లాన్‌లా కనిపిస్తుంది. వచ్చే 18 నెలల పాటు బుమ్రా టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉండే ఛాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలను నుంచి సమాచారం అందుతుంది. ఇది రిటైర్మెంట్ కాదు, కేవలం వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా తీసుకున్న ఒక నిర్ణయం మాత్రమేనని పేర్కొంటున్నారు. 

2027లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌పైనే ఇప్పుడు టీమిండియా పూర్తిగా దృష్టి పెట్టింది. ఈ మెగా టోర్నమెంట్‌లో జస్ ప్రీత్ బుమ్రా సేవలు అత్యంత కీలకం కావడంతో.. అతడిని శారీరకంగా, మానసికంగా రెడీ చేసేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత జరగబోయే ఈ ప్రపంచ కప్‌ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే , నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మొత్తం 14 జట్లు ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. 54 మ్యాచ్‌లు జరగనుండగా, అందులో 44 మ్యాచ్‌లకు సౌతాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుండగా.. మిగిలిన 10 మ్యాచ్‌లను జింబాబ్వే, నమీబియా వేదికలుగా కొనసాగుతాయి. ఇది 2003 ప్రపంచ కప్ తరహాలో జరిగే ఛాన్స్ ఉంది. ఇందులో రెండు గ్రూపులుగా టీమ్స్ విడిపోయి, సూపర్ సిక్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్లో పోటీ పడుతాయి. 

జస్‌ప్రీత్ బుమ్రా వయస్సు, ఫిట్‌నెస్ ని పరిగణనలోకి తీసుకుని.. అన్ని ఫార్మాట్లలో అతడు ఆడి అలసిపోవడం జట్టుకు పెద్ద నష్టం కలుగజేస్తుంది. కాబట్టి, బుమ్రాను వన్డేలు, టెస్టులకే పరిమితం చేసి, వన్డే ప్రపంచ కప్ 2027 కోసం పదును పెట్టాలని టీమిండియా మేనేజ్‌మెంట్ చూస్తుంది. బుమ్రా కూడా ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏదేమైనా, బుమ్రా టీ20 ఫార్మాట్లో కనిపించకపోవడం క్రికెట్ అభిమానులకు లోటుగానే అనిపిస్తుంది. కానీ, 2027లో వరల్డ్ కప్ ట్రోనీని దక్కించుకోవాలంటే మన బుమ్రా అప్పటి వరకు అద్భుతమైన ఫామ్, ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం.

 

©️ VIL Media Pvt Ltd.