Reading Time: 2 minutes

హర్మూజ్ జల సంధి నుంచి ఆయిల్ నౌకలకు గ్రీన్ సిగ్నల్ లేదు : క్లారిటీ ఇచ్చిన ఇరాన్

Caption of Image.

హార్ముజ్ జలసంధి ద్వారా భారత్ చమురు నౌకల రాకపోకలపై వస్తున్న వార్తలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది.  హార్ముజ్ జలసంధి ద్వారా భారత్ నౌకలు ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించిందని ప్రచారం తర్వాత కొన్ని గంటల్లో ఇరాన్ ఖండించింది. 

గురువారం (మార్చి12) ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్  మధ్య జరిగిన చర్చల తర్వాత, భారత ట్యాంకర్లు పుష్పక్, పరిమల్ హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు అనుమతించారని ప్రచారం సాగింది.అయితే టెహ్రాన్ వర్గాలు ఈ వాదనలను ఖండించింది. భారత్ నౌకలను ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ప్రకటించింది.

హార్ముజ్ జలసంధి.. ఇరాన్, ఒమన్  దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక జలమార్గం. దీని ద్వారా రోజుకు 13 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతుంది. ప్రపంచ ఎగుమతుల్లో ఇది మూడింట ఒక  వంతు. జలసంధి ముసివేస్తే చమురు ధరలు, ప్రపంచ దేశాలకు సరఫరా , గల్ఫ్ ఎగుమతులపై ఆధారపడే దేశాలకు ఇంధన సరఫరాలో ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. 

అమెరికా, ఇరాన్ సంక్షోభం ప్రారంభమైన తర్వాత హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఆ ప్రాంతంనుంచి ఎటువంటి నౌకలను అనుమతించలేదు. అయితే సౌదీ క్రూడ్ ఆయిల్ తీసుకొని వస్తున్న లైబీరియన్ ట్యాంకర్ ను  ముంబైకి వచ్చేందుకు అనుమతించింది. వివాదం ప్రారంభం తర్వాత ఇది మొదటి నౌక. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జలమార్గం గుండా ఎటువంటి చమురు నౌకలను అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేసింది.  భారత విదేశాంగ మంత్రి జౌశంకర్ చర్చలు జరిపిన తర్వాత కూడా ఈ జలసంధి గుండా నౌకలు ప్రయాణించేందుకు టెహ్రాన్ అనుమతి పొందాలని ఇరాన్ తెలిపింది. 

ప్రమాదం అంచున చమురు మార్కెట్లు.. 

ఇరాన్,  ఇజ్రాయెల్, అమెరికా మద్య ఉద్రిక్త పరిస్ధితులు 13 రోజుకు చేరుకున్నాయి.   దీంతో ఇరాన్ ఆధీనంలో ఉన్న హార్ముజ్ జలసంధి మూసివేశారు. సముద్ర రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ముడి చమురు ధరలు బాగా పెరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ , దాని మిత్ర దేశాలకు చెందినచమురు నౌకలు తప్పా మిగతా నౌకలు సురక్షితంగా ఈ మార్గం గుండా ప్రయాణించొచ్చని ఇరాన్ ప్రకటించింది. అయితే అందుకు భిన్నంగా హర్ముజ్ జలసంధి దగ్గర పరిస్థితి ప్రమాదకరంగా మారింది. 

ఇరాన్ నిర్ణయం భారత్ పై మరింత ప్రభావం చూపనుంది. భారత్ కు అత్యధికంగా హార్ముజ్ జలసంధి గుండానే చమురు, గ్యాస్  రవాణా అవుతుంది. దీంతో భారత్ లో గ్యాస్ తో పాటు చమురు కొరత తీవ్రతరం కానుంది.

©️ VIL Media Pvt Ltd.