July 10, 2026

Hardik Pandya: స్టేడియంలో హార్దిక్ పాండ్యా రొమాన్స్.. కేసు నమోదుతో జైలు శిక్ష?

Hardik Pandya: స్టేడియంలో హార్దిక్ పాండ్యా రొమాన్స్.. కేసు నమోదుతో జైలు శిక్ష?
Reading Time: < 1 minute

Hardik Pandya: స్టేడియంలో హార్దిక్ పాండ్యా రొమాన్స్.. కేసు నమోదుతో జైలు శిక్ష?

Caption of Image.

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ విజయోత్సవాల సందర్భంగా హార్దిక్.. జాతీయ జెండాను అవమానించాడంతో అతని మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వాజిద్ ఖాన్ అనే న్యాయవాది పుణే పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయాన్ని శివాజీ నగర్ పోలీసులు ధ్రువీకరించారు.

అడ్వకేట్ వాజిద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. అందరూ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసే ఉంటారు.. కానీ, ట్రోఫీ అందుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా మాత్రం సెలబ్రేషన్స్‌ లో జాతీయ జెండాను తన వీపుకు చుట్టుకుని, తన గర్ల్‌ఫ్రెండ్‌తో డ్యాన్స్ చేశాడని ఆరోపించాడు. అయితే 1971 జాతీయ జెండా చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం.. మనమంతా త్రివర్ణ పతాకాన్ని గౌరవించాలి. కానీ, ఆ సెలబ్రేషన్స్‌లో హార్దిక్ జాతీయ జెండాను కట్టుకోవడం సహా తన ప్రేయసితో ట్రోఫీ అందజేసిన స్టేజీ మీద పడుకున్నాడు. అది జాతీయ జెండాకు తీవ్ర అవమానం అని న్యాయవాది వాజిద్ ఖాన్ తెలిపారు. 

న్యాయవాది వాజిద్ ఖాన్ ఇచ్చిన కంప్లైంట్ లో జాతీయ జెండా గౌరవానికి అవమానాల నిరోధక చట్టం గురించి పేర్కొన్నారు. ఈ చట్టం గురించి చెప్పాలంటే.. 1971 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం.. ఏదైనా బహిరంగ ప్రదేశంలో లేదా జనావాసాల్లోని లేదో మరేదైనా ప్రాంతంలో జాతీయ జెండా (త్రివర్ణ పతాకం)న్ని మంటల్లో కాల్చడం, చించివేయడం లేదా కట్ చేయడం, అసభ్యకరంగా ఉపయోగించడం, నాశనం చేయడం, కాళ్లతో తొక్కడం లాంటి ఇతర  విధంగా అగౌరవ పర్చితే అది జాతీయ జెండా ధిక్కారానికి గురిచేసిన శిక్షార్హం అవుతుంది. దీంతో మరి హార్దిక్ పాండ్యాకు జైలు శిక్ష పడే అవకాశం ఉందా లేదా అనేది త్వరలో తెలుస్తుంది.  

 

©️ VIL Media Pvt Ltd.