July 10, 2026

Election Impact On IPL: ఆ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ తేదీలు వచ్చిన తర్వాతే ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ విడుదల 

Election Impact On IPL: ఆ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ తేదీలు వచ్చిన తర్వాతే ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ విడుదల 
Reading Time: 2 minutes

Election Impact On IPL: ఆ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ తేదీలు వచ్చిన తర్వాతే ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ విడుదల 

Caption of Image.

Election Impact On IPL: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 19వ సీజన్‌కు సంబంధించిన తొలి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ సీజన్ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 12వ తేదీ వరకు తొలి దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. అయితే బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌లకు ఒక ముఖ్యమైన కండిషన్ ఉంది. కర్ణాటక ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నుంచి అనుమతి లభించిన తర్వాతే అక్కడ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ కమిటీ మార్చి 13వ తేదీన చిన్నస్వామి స్టేడియాన్ని పరిశీలించి మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లపై పూర్తి స్థాయి  మాక్ డెమో నిర్వహించనుంది. అనంతరం స్టేడియంలో మ్యాచ్ ఆడేదానిపై తుది నిర్ణయం ప్రకటించనుంది. 

మరోవైపు మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత వెల్లడిస్తామని బీసీసీఐ తెలిపింది. ఇప్పుడు కేవలం ఐపీఎల్ 2026 తొలి దశలో మొత్తం 20 మ్యాచ్‌లు 10 వేదికల్లో నిర్వహించనున్నారు. బెంగళూరు, ముంబై, గౌహతి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ వేదికల్లో మాత్రమే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దశలో నాలుగు డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, సాయంత్రం మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. కాగా మొదటి డబుల్ హెడర్ ఏప్రిల్ 4వ తేదీన జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి. అదే రోజు సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. 

హోమ్ మ్యాచులు: 
* ప్రస్తుత ప్రణాళిక ప్రకారం బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐదు హోమ్ మ్యాచ్‌లు, రాయపూర్‌లో రెండు మ్యాచ్‌లు ఆడనుంది.
* పంజాబ్ కింగ్స్ నాలుగు మ్యాచ్‌లు న్యూ చండీగఢ్‌లో, మూడు మ్యాచ్‌లు ధర్మశాలలో ఆడనుంది.
* రాజస్థాన్ రాయల్స్ తమ హోమ్ మ్యాచ్‌లను గౌహతి అండ్ జైపూర్ లలో జరగనున్నాయి.  

©️ VIL Media Pvt Ltd.