Reading Time: 2 minutes

Vadhala : జగపతి బాబు – లయ జోడీ గా సస్పెన్స్ థ్రిల్లర్.. ‘వదలా’ గ్లింప్స్ రిలీజ్!

Caption of Image.

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర సొంతం చేసుకున్న నటుడు జగపతి బాబు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం  ‘వదలా’ . ఈ మూవీలో లయ,హృతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో సస్పెన్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్, ప్రేక్షకులలో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

తమ్మారెడ్డి భరద్వాజ సెకండ్ ఇన్నింగ్స్

సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. కిశోర్ నాయుడుతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ రోజు ( మార్చి 11, 2026 ) జరిగిన ప్రెస్ మీట్‌లో తమ్మారెడ్డి తన భావోద్వేగాన్ని పంచుకున్నారు.. “ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సినిమా నిర్మించాలంటే భయం వేసింది. కానీ దర్శకుడికి కథపై ఉన్న నమ్మకం నన్ను ముందుకు నడిపించింది. ఈ రోజుల్లో కూడా కష్టపడి పని చేసే టీమ్ దొరకడం నా అదృష్టం. ముఖ్యంగా జగపతి బాబులేకుండా ఈ సినిమాను ఊహించుకోలేంఅని పేర్కొన్నారు.

మళ్ళీ అదే మ్యాజిక్!

ఒకప్పుడు వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు, లయ చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దీనిపై జగపతి బాబు స్పందిస్తూ.. నేను పరిశ్రమకు వచ్చిన కొత్తలో భరద్వాజతో సినిమా చేయాల్సింది, కానీ అది కుదరలేదు. మళ్ళీ ఇన్నేళ్లకు ‘వదలా’తో మా కలయిక కుదిరింది. లయతో కలిసి నటించడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది అని తెలిపారు.

గ్లింప్స్ ఎలా ఉంది?

విడుదలైన గ్లింప్స్‌ను పరిశీలిస్తే, ఇది ఒక వ్యక్తి జీవితంలోని రహస్యాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే గ్రిప్పింగ్ సస్పెన్స్ డ్రామా అని అర్థమవుతోంది. నేపథ్య సంగీతం, విజువల్స్ సినిమాలోని సీరియస్‌నెస్‌ను ఎలివేట్ చేస్తున్నాయి. జగపతి బాబు గెటప్, ఆయన పలికించిన హావభావాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. త్వరలోనే చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించనుంది.

 

©️ VIL Media Pvt Ltd.