Reading Time: < 1 minute

భక్తి శ్రద్ధలతో పరమహంస యోగానంద.. మహాసమాధి ఆరాధనోత్సవాలు

Caption of Image.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSS) వ్యవస్థాపకులు, ఒక యోగి ఆత్మకథ (Autobiography of a Yogi) రచయిత పరమహంస యోగానంద మహాసమాధి ఆరాధనోత్సవాలు మార్చి 7న భక్తి శ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ బేగంపేట, నోయిడా, రాంచీ, ద్వారహట్ వంటి ప్రధాన YSS ఆశ్రమాలు ,ధ్యాన కేంద్రాలలో భక్తులు ప్రత్యేక ధ్యానం, కీర్తనలు, పుష్పాంజలితో గురువును స్మరించుకున్నారు.

1952 మార్చి 7న కాలిఫోర్నియాలో పరమహంస యోగానంద మహాసమాధి (యోగి తన శరీరాన్ని ఇష్టపూర్వకంగా విడిచిపెట్టడం) పొందారు.ఆయన బోధనలు, క్రియాయోగ విధానం, విశ్వవ్యాప్త చైతన్యాన్ని గుర్తుచేసుకుంటూ ఈ వేడుకలను నిర్వహించారు. ధ్యాన కేంద్రాల్లో ప్రత్యేక సామూహిక ధ్యాన కార్యక్రమాలు, ఆయన రచనల నుంచి పఠనం,  భక్తి గీతాలాపన చేశారు.  

నా శరీరం వెళ్ళిపోవచ్చు, కానీ నా పని కొనసాగుతుంది అన్న యోగానంద మాటలను భక్తులు స్మరించుకుంటూ ఆయన మార్గంలో నడవాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా యోగదా సత్సంగ సొసైటీ ,Self-Realization Fellowship  ప్రత్యేక ఆన్‌లైన్ ధ్యాన కార్యక్రమాలను కూడా నిర్వహించాయి. 

©️ VIL Media Pvt Ltd.