Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాం గ్రెస్ సర్కార్ సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియ ల్ ఎస్టేట్ దందాలపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తా రు. రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా.. లేక రియ ల్ ఎస్టేట్ కంపెనీనా..? అని బిఆర్‌ఎస్ డిప్యూ టీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వ భూములు రక్షించాల్సిన ము ఖ్యమంత్రి, మంత్రులే భూ బకాసురులుగా మా రి భూములను భక్షిస్తుంటే ఇక రక్షించే వారెవరు..? అని ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్‌కు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలంలోని మానసహిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్ర మ క్వారీలు నిర్వహిస్తూ కొండలను పిండి చేసి కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నట్టు అని ప్రశ్నించారు. ని బంధనలకు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో స హజ సంపదను కొల్లగొట్టే గలీజ్ దందా చేస్తుం టే రెవెన్యు, మైనింగ్, పిసిబి,హెచ్‌ఎండిఎ అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడటం లేదు..? అని నిలదీశారు. రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లను తొ లుస్తూ, అక్రమంగా తరలిస్తూ యధేచ్చగా వ్యా పారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని అడిగారు. సాధారణ వ్యక్తులకు ఒ క న్యాయం… మంత్రికిఒక న్యాయమా..? అని ప్రశ్నించారు.ఈ మేరకు మంగళవారం హరీష్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం..మంత్రి కుటుంబం చేస్తే ఆ అక్రమం సక్రమం అవుతుందా..? అని నిలదీశారు.

నెలల తరబడి కొండలను పిండి చేసి, భారీగా కాంక్రీటు తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి… విద్యుత్ మంత్రి భట్టి విక్రమార్క, పర్యావరణ మంత్రి కొండా సురేఖ, గనుల శాఖ మంత్రి వివేక్ సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నట్లు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయా శాఖల్లోని విజిలెన్స్ విభాగాలు పని చేయడం లేదా..లేక సహచర మంత్రి చీకటి వ్యాపారానికి ఉద్దేశ్యపూర్వకంగానే సహకరిస్తున్నాయా..ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ముడుతున్నాయి..అధికారుల నుండి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఎందరి చేతులు తడుస్తున్నాయి..? అని ప్రశ్నించారు. క్వారీకి ఎలాంటి అనుమతులు లేకున్నా మంత్రి కుటుంబం అయితే సరిపోతుందా..? అని నిలదీశారు. టిఎస్‌పిసిబి నుంచి కాన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్(సిఎఫ్‌ఇ), కాన్సెంట్ ఫర్ ఆపరేషన్(సిఎఫ్‌ఒ) అనుమతి లేదు.. పర్యావరణ అనుమతి లేదు…మైనింగ్/క్వారీయింగ్ లీజ్ అనుమతి మైన్స్, జియాలజీ విభాగం అనుమతి లేదు.. స్థానిక గ్రామపంచాయతీ/మున్సిపల్ అనుమతి, ల్యాండ్ యూజ్ మార్పిడి, హెచ్‌ఎండిఎ క్లియరెన్స్ లేదు, విస్ఫోటక పదార్థాల వినియోగం కోసం ఎక్స్‌ప్లోజివ్ లైసెన్స్ లేదు..గ్రౌండ్ వాటర్ వినియోగానికి సంబంధిత అనుమతులు లేవు…

రెవెన్యూ అనుమతులు లేవు అని పేర్కొన్నారు. ఏ అనుమతి లేకుండా అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలను మాయం చేస్తూ భారీ స్థాయిలో రాళ్లు-కాంక్రీటు తరలించడం చట్టవిరుద్ధం అనే విషయం తెలియదా..? అని అడిగారు. ఒక వైపు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల ఇండ్లు కూల్చుతున్నారని, మరోవైపు అదే ముఖ్యమంత్రి తన అల్లుడి అనుయాయుల క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెడతారని అన్నారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నదని, ఓపెన్ బిడ్డింగ్ పిలవాలని తాము డిమాండ్ చేస్తే మూడు రోజులు అయినా తేలు కుట్టిన దొంగల్లా ఉలుకరు పలకరు అని విమర్శించారు. ఇంకోవైపు మంత్రి పొంగులేటి అక్రమ క్వారీతో ఏకంగా కొండలనే ఖతం చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రెటెషన్ ఏజెన్సీ అని గొప్పలు చెప్పడమే తప్ప ప్రభుత్వ ఆస్తిని మంత్రి కంపెనీ అప్పనంగా తన్నుకు పోతుంటే ఎందుకు ప్రొటెక్ట్ చేయడం లేదని అడిగారు.

శని, ఆదివారాలు వచ్చిందంటే చాలు పేదల ఇళ్ల మీదకు వెళ్ళే హైడ్రా బుల్డోజర్‌కు ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ అక్రమ క్వారీ కనిపించడం లేదా..సాధారణ ప్రజలకు ఒక న్యాయం.. ముఖ్యమంత్రి అల్లుడి అనుయాయులు, మంత్రులకు ఒక న్యాయమా…? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మైనింగ్ దందాలలో సిఎంకు ఎలాంటి వాటా లేకపోతే, వెంటనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్రమ క్వారీని వెంటనే మూసివేయించాలని, ఇప్పటి వరకు కొల్లగొట్టిన సహజ సంపద మొత్తాన్ని పెనాల్టీతో సహా రికవరీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ముఖ్యమంత్రి తన అల్లుడి అనుయాయుల క్వారీ కోసం ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా కట్టబెట్టిన 17 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపును వెంటనే రద్దు చేసి, పారదర్శకంగా ఓపెన్ బిడ్డింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అల్లుడు అనుయాయులు, మంత్రి పొంగులేటి సంస్థ నిర్వహిస్తున్న అక్రమ క్వారీకి సంబంధించిన ఫోటోలు, పూర్తి వివరాలను మీడియా సాక్షిగా విడుదల చేస్తున్నానని, అయినప్పటికీ సిఎంకు ఈ మైనింగ్ దందా కనిపించకపోతే స్వయంగా తానే వచ్చి చూపిస్తానని అన్నారు.