Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఖాళీలేర్పడిన రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం బుధవారం అభ్యర్థులను ప్రకటించనున్నది. అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం హస్తినకు వెళ్ళనున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అ యిన రెండు రాజ్యసభ స్థానాలు అధికార కాంగ్రె స్ పార్టీకి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటిదాకా కాం గ్రెస్ అధిష్ఠానం తేల్చకపోవడంతో ఆశావాహుల్లో ఉత్కంఠత నెలకున్నది. వీటికి నామినేషన్లు దాఖలుకు ఈ నెల 5న గడువు ముగియనుండగా, ఈ నెల 16న పోలింగ్ జరగనున్నది. రాష్ట్రం నుంచి కెఆర్ సురేష్‌రెడ్డి (బిఆర్‌ఎస్), అభిషేక్ మను సిం ఘ్వీ (కాంగ్రెస్) పదవీ కాలం వచ్చే నెల ఏప్రిల్ 9న ముగియనున్నది. ఈ రెండు స్థానాలకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు రాజ్యసభ పదవిని ఆశిస్తోన్న పలువురు సీనియర్ నాయకులు తమకు అధిష్ఠానం వద్ద ప లుకుబడితో లాబీయింగ్‌ను మమ్మరం చేశారు. కాగా రెండు స్థానాల్లో ప్రస్తుతం ఉన్న అభిషేక్ మ ను సింఘ్వీని తిరిగి రాజ్యసభ ఇస్తుందా? లేక ఇతరులకు అవకాశం కల్పిస్తుందా? అనే సస్పెన్స్ కొనసాగుతున్నది. సింఘ్వీ ఏఐసిసి అగ్ర నేత సోని యా గాంధీ కుటుంబానికి  సన్నిహితుడు కావడంతో పాటు పార్టీకి సంబంధించిన కోర్టు కేసుల ను ఆయనే చూసుకుంటున్నారు.

పార్టీకి అవసరమైన వ్యక్తిగా, పార్టీకి విధేయుడిగా సింఘ్వికి తిరి గి అవకాశం కల్పిస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రెండు స్థానాలకు రాష్ట్రం నుంచే అవకాశం కల్పించి సింఘ్వికి మరో రాష్ట్రం నుంచి అవకాశం కల్పిస్తుందన్న వాదన కూడా లేకపోలేదు. ఒకవేళ సింఘ్వికి కేటాయిస్తే ఇక మిగిలేది ఒక్క స్థానమే. అది ఏ సామాజిక వర్గానికి దక్కుతుందోనన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతున్నది. పార్టీలో సీనియర్ నాయకుడినైన తనకు ఇవ్వాలని మాజీ ఎంపీ వి. హనుమంత రావు కోరుతుండగా, మరోవైపు పార్టీ క్రమశిక్షణా సంఘం ఉపాధ్యక్షుడు అనంతుల శ్యాం మోహన్ హస్తినలో పార్టీ పెద్దలను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరారు. గతంలో పిసిసి అధ్యక్ష పదవికి తీవ్రంగా ప్రయత్నించిన బిసి నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పేరును అధిష్టానానికి సిఫార్సు చేసే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నారు. తనకు నమ్మకస్తుడైన వేం నరేందర్ రెడ్డిని తనతోనే ఉండాలని ముఖ్యమంత్రి తన సలహాదారునిగా నియమించుకోవడంతో రాజ్యసభకు పంపించకపోవచ్చని కూడా కొందరి వాదన.

ఉప రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో యుపిఏ తరపున పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ ఆయనేమి ఆ పదవిని ఆశించడం లేదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలాఉండగా వికారాబాద్‌లో ఏర్పాటైన తెలుగు రాష్ట్రాల డిసిసి అధ్యక్షుల శిక్షణా శిబిరంలో పాల్గొనేందుకు వచ్చిన ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్‌తో ఈ అంశంపై చర్చించినప్పటికీ తుది నిర్ణయం తీసుకునేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా చెప్పివెళ్లారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ బుధవారం ఢిల్లీ వెళ్ళనున్నట్టు సమాచారం. గురువారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనున్నందున బుధవారం ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. రాజ్యసభకు ఖాళీగా ఏర్పడిన రెండు సీట్లకుగాను రాష్ట్రం నుంచి పదహారు మంది రేసులో ఉన్నప్పటికీ నాలుగురి అభ్యర్థిత్వాలపైనే ప్రధానంగా చర్చించి అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.