Reading Time: < 1 minute

హార్మూజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి.. నలుగురు భారతీయులకు గాయాలు

Caption of Image.

తమ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మృతికి నిరసనగా ఇరాన్ దాడుల తీవ్రతను పెంచింది. చుట్టుపక్కన ఉన్న అమెరికాకు మద్ధతునిచ్చే దేశాలపై మిస్సైళ్ల దాడిని మరింత ఉధృతం చేసింది. అదే క్రమంలో ఆదివారం (మార్చి 01) ఒమన్ వ్యూహాత్మక జలసంధి హార్యూజ్ లక్ష్యంగా దాడులకు దిగింది. 

హార్యూజ్ జలసంధిలో 20 మంది క్రూ మెంబర్లతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ను పేల్చేసింది ఇరాన్. ముసాండం గవర్నరేట్‌లోని ఖసాబ్ పోర్టుకు ఉత్తరాన ఐదు నాటికల్ మైళ్ల దూరంలో పలావు జెండాతో ఉన్న  స్కైలైట్‌ అనే ట్యాంకర్ పే లక్ష్యంగా చేసుకున్నట్లు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది.

20 మంది సిబ్బందిలో 15 మంది ఇండియన్స్ తో పాటు ఇరాన్ దేశస్తులను సేఫ్ గా ఖాళీ చేయించారు. నలుగురు గాయపడినట్లు ప్రాథమిక సమాచార నివేదిక ద్వారా తెలుస్తోంది. గల్ఫ్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 

IRGC హెచ్చరికలతో జలసంధి మూసివేత:

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హెచ్చరికలతో హార్ముజ్ జలసంధిని మూసివేశారు.  టెహ్రాన్ అధికారికంగా పూర్తి దిగ్బంధనను ప్రకటించనప్పటికీ, హార్ముజ్ జలసంధిని దాటడానికి ఏ నౌకకు అనుమతి లేదని హెచ్చరిలు జారీ అయినట్లు రాయిటర్స్ సంస్థ పేర్కొంది. 

హార్మూజ్ .. పర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్‌కు అనుసంధానించే జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఇక్కడి నుంచే జరుగుతుంది. అంతేకాకుండా పెద్ద మొత్తంలో లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ LNGని రవాణా కూడా ఈ జలసంధి నుంచి జరుగుంది. LNG రవాణా ఎక్కువగా ఖతార్ నుండి  సరఫరా అవుతుంటుంది.  ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర చోక్ పాయింట్లలో ఒకటిగా ఆర్మూజ్ జలసంధిని పరిగణిస్తుంటారు. 

©️ VIL Media Pvt Ltd.