Reading Time: < 1 minute

పాకిస్తాన్‎లోని యూఎస్ కాన్సలేట్‎పై దాడి.. నిప్పు పెట్టేందుకు ఆందోళనకారుల యత్నం

Caption of Image.

ఇస్లామాబాద్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యతో ఇరాన్ మద్దతుదారులు భగ్గుమంటున్నారు. ఖమేనీని హతమార్చిన అమెరికా, ఇజ్రాయెల్‎కు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‎లోని కరాచీలో ఉన్న యూఎస్ కాన్సులేట్‎పై ఇరాన్ సపోర్టర్స్ దాడికి పాల్పడ్డారు.

ఇరాన్‎కు మద్దతుగా నినాదాలు చేస్తూ గేటు దాటుకుని లోపలికి వెళ్లి కర్రలు, రాళ్లతో ఎటాక్ చేశారు. యూఎస్ కాన్సులేట్‎కు నిప్పు పెట్టేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. 

పరిస్థితులు చేదాటిపోతుండటంతో టియర్ గ్యాస్ ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు అయినప్పటికీ వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆందోళనల దృష్ట్యా కాన్సులేట్ వైపు వచ్చే అన్ని దారులను మూసివేశారు. యూఎస్ కాన్సులేట్ సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాన్సులేట్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. 

©️ VIL Media Pvt Ltd.