Reading Time: < 1 minute
Hrithik Roshan Krrish 4 Delayed Hombale Films South Movie Updates

భారతీయ వెండితెరపై సూపర్ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘క్రిష్’. హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా రాబోతున్న ‘క్రిష్ 4’ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా ‘వార్ 2’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హృతిక్, తన తదుపరి చిత్రంగా క్రిష్‌ను సెట్స్ పైకి తీసుకెళ్తారని అందరూ భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం హృతిక్ తన ఫోకస్‌ను ఒక భారీ సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది.

Also Read : Manchu Vishnu:యుద్ధం మధ్యలో చిక్కుకున్న మంచు విష్ణు.. చిన్న కుమార్తె ఐరా భయంతో కన్నీళ్లు!

హృతిక్ రోషన్ తన కెరీర్‌లో మొదటిసారి ఒక సౌత్ ఇండియన్ నిర్మాణ సంస్థతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన కన్నడ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ (Hombale Films) తో హృతిక్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నారు. తాజా నివేదికల ప్రకారం, హృతిక్ ‘క్రిష్ 4’ కంటే ముందే ఈ హోంబళే ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని సమాచారం.దీంతో హృతిక్ సొంత దర్శకత్వ పర్యవేక్షణలో రానున్న ‘క్రిష్ 4’ స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని, అందుకే ఈ గ్యాప్‌లో సౌత్ ప్రాజెక్టును ముగించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. దశాబ్ద కాలంగా ‘క్రిష్’ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇది కొంత నిరాశ కలిగించే విషయమే.. అయినా, హోంబళే వంటి సంస్థతో హృతిక్ సినిమా అంటే అది ఏ రేంజ్‌లో ఉంటుందోనన్న ఆసక్తి కూడా నెలకొంది.