Reading Time: < 1 minute
Pakistan Vs Sri Lanka Do Or Die Match T20 World Cup 2026 Super 8 Semi Final Scenario

Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్‌కు ఇది ‘డూ ఆర్ డై’ రోజు. సూపర్ 8 దశలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిన సల్మాన్ అలీ ఆఘా సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు, ఇప్పుడు సెమీఫైనల్ ఆశలను తమ చేతుల్లోనే ఉంచుకుంది. ఈ ఒక్క విజయంతో పాకిస్థాన్ గట్టెక్కినట్టే! ఇప్పటికే సూపర్ 8 గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్ టికెట్‌ను ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్ శుక్రవారం న్యూజిలాండ్‌ను ఓడించడం పాకిస్థాన్‌కు పెద్ద ఊరటనిచ్చింది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచుంటే, పాకిస్థాన్ కథ అక్కడితో ముగిసిపోయేదే. కానీ ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో గ్రూప్‌లో రెండో స్థానానికి పోటీ మళ్లీ ఉత్కంఠభరితంగా మారింది.

READ MORE: Israel-Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ..?

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్ 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ మాత్రం రెండు మ్యాచ్‌లలో ఒక్క పాయింట్ మాత్రమే సాధించింది. వారి తొలి మ్యాచ్ న్యూజిలాండ్‌తో వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్‌లోనూ వెనుకబడ్డారు. న్యూజిలాండ్‌కు +1.390 నెట్ రన్ రేట్ ఉండగా, పాకిస్థాన్‌ది -0.461 మాత్రమే. ఇదే ఇప్పుడు వారికి పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు శ్రీలంకతో జరిగే మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుంది. పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగనున్న ఈ పోరు, వారి సెమీఫైనల్ అవకాశాలను తేల్చేస్తుంది. కేవలం గెలవడం సరిపోదు.. భారీ తేడాతో గెలవాలి. ఈ మ్యాచ్‌లో గాని ఒక్క తప్పు చేసినా పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఇక్కడ పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌పై విమర్శలు వస్తున్నాయి. చివరికి ఏం జరుగుతుందో చూద్దాం..

READ MORE: Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..