Reading Time: < 1 minute
Khamenei Moved Secure Location Tehran Airstrikes Us Israel War

Israel-Iran War: ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయిల్ అమెరికాలు సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. మధ్యప్రాచ్యంలోని యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రైయిన్, సౌదీ అరేబియాలలోని యూఎస్ మిలిటరీ బేస్‌లపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడులు మొత్తం మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలకు కారణమైంది.

Read Also: Trump Bans Anthropic: AI ప్రపంచంలో సంచలనం సృష్టించిన ట్రంప్ .. అమెరికాలో ‘ఆంత్రోపిక్’ క్లోజ్!

అయితే, సుప్రీంలీడర్ ఖమేనీ నివాసం, కార్యాలయంపై దాడులు చేసింది. ఆ సమయంలో ఖమేనీ అక్కడ లేడని తెలుస్తోంది. ఇరాన్ ప్రభుత్వం ఖమేనీని సురక్షిత బంకర్‌కు మార్చినట్లు సమాచారం. అత్యంత భద్రత కలిగిన అండర్ గ్రౌండ్ బంకర్‌లో ఖమేనీని ఉంచినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్, యూఎస్ కలిసి ఇరాన్‌లో ‘‘పాలన మార్పు’’కు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మతనాయకుడు ఖమేనీని అంతం చేయాలని భావిస్తున్నాయి. దాడుల సమయంలో ఖమేనీ టెహ్రాన్ లో లేడని తెలిసింది. అమెరికాతో అణుచర్చలు విఫలం తర్వాత రాబోయే దాడి గురించి ముందే తెలిసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.