Reading Time: < 1 minute
Telangana Inter Exams 2026 Begin 1495 Centres 997075 Students Helpline Details

Inter Exams 2026: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ప్రథమ, గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1495పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్టియర్‌లో 489126 మంది, సెకండియర్‌లో 507949 మంది కలిపి మొత్తం 997075 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. విద్యార్థుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, గోడ గడియారాలు ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో ఒత్తిడి, ఆందోళన, మానసిక ఆవేదన లాంటి సమస్యలను అధిగమించేందుకు 14416, 80693 91416 నెంబర్లను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు ఈ నెంబర్లకు ఫోన్‌ చేసి కౌన్సెలింగ్‌ సేవలు పొందవచ్చు. ముఖ్యంగా ఇది పరీక్షల సమయం కాబట్టి ఎవరైనా విద్యార్థులు లిఫ్ట్ అడిగితే సానుకూల దృక్పథంతో ఇవ్వండి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్!

READ MORE: Off The Record: కట్టప్పల మీద యాక్షన్ ఉంటుందా..? సీనియర్ల అసమ్మతికి హైకమాండ్ ఇచ్చే ట్రీట్‌మెంట్..?