Reading Time: < 1 minute

అమరావతి: రాజమండ్రిలో కల్తీ పాల తాగి నలుగురు అస్వస్థతతకు గురై చనిపోయారని, ఇద్దరు వెంటిలేటర్లపై ఉన్నారని, ఈ ఘటన బాధాకరమని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి ఎంక్వైరీ చేస్తున్నామని అన్నారు. కల్తీ పాల విషయంపై సిఎం అసెంబ్లీలో మాట్లాడారు. చనిపోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదని చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని అన్నారు. మరో 8 మందికి చికిత్స కొనసాగుతుందని, కల్తీపాల బాధ్యులను వదిలేది లేదని, పాల వ్యాపారి నాగేశ్వరరావును అరెస్టు చేశామని చెప్పారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.