సేమియా పాయసానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు సేమియా , ఒక కప్పు పాలు , ఒక కప్పు బెల్లం లేదా చక్కెర, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , 10 కాజూ , ఇంకా 10 కిస్మిస్ , అర టేబుల్ స్పూన్ యాలకల పొడి , ఇంకా కొద్దిగా కుంకుమపువ్వును తీసుకోవాలి. ఇవన్ని వేసి సేమియా పాయసం చేస్తే ఒంటికి చలువ చేస్తుంది.
సేమియా పాయసానికి తయారీ విధానం: ముందుగా సేమియాను బాగా వేయించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి దానిలో నెయ్యి చేసి అది వేడి అయ్యాక సేమియాను వేసి బంగారు కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి. ఇలా చేస్తే పాయసం మంచి వాసన కూడా వస్తుంది. అంతేకాదు, టేస్టీగా కూడా ఉంటుంది.
పాలను ఇలా మరిగించుకోవాలి: ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దానిని పొయ్యి మీద పెట్టి, పాలను బాగా మరిగించాలి. ఇంకా ,ఆ తరవాత మరిగిన పాలలో ముందుగా వేయించిన సేమియా వేసి మీడియం మంటపై బాగా ఉడికించాలి. ఇది
మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం లేదా పంచదారను వేసి కలపాలి.
బెల్లం ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది ఇంకా ఇది హెల్తీ కూడా. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా దీనిలో కలుపుకోవాలి. ఆ తరవాత మరో పాన్లో కొద్దిగా నెయ్యి వేసి కాజూ, కిస్మిస్ కూడా వేసి బాగా వేయించి వీటిని పాయసంలో కలపాలి. యాలకల పొడి, కొద్దిగా కుంకుమపువ్వు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
పాయసం చల్లారిన తర్వాత ఫ్రిజ్లో ఉంచి తాగితే ఒంటికి కూడా చలువ చేస్తుంది. ఇంకా ఇది వేడి వేడి లేదా చల్లగా ఇలా రెండు రకాలుగా తినొచ్చు. వేసవిలో తీసుకుంటే శరీరానికి రిలీఫ్ ఇస్తుంది. అంతేకాదు, ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది. ఇది తిన్న వెంటనే ఈజీగా జీర్ణమవుతుంది ఎనర్జీ కూడా ఇస్తుంది.




