Reading Time: < 1 minute

ఆర్టీసీ కార్గోలో మళ్లీ వేలం..లాజిస్టిక్ లో డెలివరీ తీసుకోని వస్తువులపై ఆదాయం

Caption of Image.

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గోలో క్లైమ్​చేయని వస్తువులను వేలం వేయనున్నట్టు ఆర్టీసీ అసిస్టెంట్​ట్రాఫిక్​ మేనేజర్​(లాజిస్టిక్​) ఇషాక్​బిన్​మహ్మద్​ఒక ప్రకటనలో తెలిపారు. లాజిస్టిక్​లో బుకింగ్​చేసి డెలివరీ తీసుకోని ఉత్పత్తులను ఈనెల 8వ తేదీన జేబీఎస్​లోని కార్గో ఆఫీసులో మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు వేలం నిర్వహించనున్నట్టు తెలిపారు. బట్టలు, ఎలక్ట్రికల్స్​, జనరల్​, స్టేషనరీ వంటి ఉత్పత్తులను వేలం వేయనున్నట్టు చెప్పారు.
 

©️ VIL Media Pvt Ltd.