
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి బాంబు బెదిరింపులతోం ఉలిక్కిపడింది. గతంలో చాలా సార్లు స్కూళ్లకు బాంబు బెదిరంపు రాగా.. అవన్నీ ఫేక్ అని తేలింది. తాజాగా ఢిల్లీకి మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో ప్రజలు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ధౌలా కువాన్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్డులోని ఎయిర్‌ఫోర్స్ బాల్ భారతి స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడంతో స్కూళ్ల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. విద్యార్థులను ఇళ్లకు పంపి.. ఢిల్లీ ఫైర్ సర్వీన్, పోలీసులు, బాంబు స్క్వాడ్ యూనిట్‌లు రెండు పాఠశాలల్లో క్షుణ్ణంగా సోదాలు చేపట్టాయి.