July 12, 2026

రైతుల మరణం విచారకరం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : ఎంపీ వంశీకృష్ణ

రైతుల మరణం విచారకరం..బాధిత కుటుంబాలను  ఆదుకుంటాం : ఎంపీ వంశీకృష్ణ
Reading Time: < 1 minute

రైతుల మరణం విచారకరం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : ఎంపీ వంశీకృష్ణ

Caption of Image.

వెలుగు: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నలుగురు రైతులు చనిపోవడం బాధాకరమని, బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు.

 బుధవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఎంపీ.. రైతుల మృతి పట్ల  సంతాపం ప్రకటించారు. లక్షెట్టిపేట మండలం గంపాలపల్లి, కొత్తూర్​గ్రామాల్లో కొనుగోలు సెంటర్​ దగ్గర ఉన్న కల్లాల వద్దకు వెళ్లిన రైతులు వర్షం పడుతుండడంతో  షెడ్డు కింద తలదాచుకున్నారని, షెడ్డు ఒక్కసారిగా  కూలి మీద పడడంతో రైతులు చనిపోయారన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా సాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  
 

©️ VIL Media Pvt Ltd.