July 15, 2026

కొడవటంచలో టీపీసీసీ ప్రెసిడెంట్ప్రత్యేక పూజలు 

కొడవటంచలో టీపీసీసీ ప్రెసిడెంట్ప్రత్యేక పూజలు 
Reading Time: < 1 minute

కొడవటంచలో టీపీసీసీ ప్రెసిడెంట్ప్రత్యేక పూజలు 

Caption of Image.

రేగొండ వెలుగు: కొడవటంచ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్​కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా వారికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారిని, దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో మహేశ్, చైర్మన్ సంపత్ రావు వారిని స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదాలు అందించి సన్మానించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు నర్సయ్య, ఉప సర్పంచ్ రాజేష్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.