Reading Time: 3 minutes

SRH vs PBKS: కొనొల్లీ సెంచరీ వృధా.. హైదరాబాద్ బౌలర్ల ధాటికి పంజాబ్ ఘోర ఓటమి

Caption of Image.

ఐపీఎల్ 2026 సీజన్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ పంజాబ్ కింగ్స్.. ప్లేఆఫ్స్ ముందు తడబడుతోంది. ఛేజింగ్ కింగ్స్ గా పేరున్న శ్రేయస్ సేన.. కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ ధాటికి కుప్పకూలిపోయింది. టపా టపా వికెట్లు సమర్పించుకుంటూ పెవిలియన్ బాట పట్టారు పంజాబ్ బ్యాటర్లు. 

హైదరాబాద్ దెబ్బకు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 202 రన్స్ మాత్రమే చేయగలిగిన పంజాబ్.. మూడో ఓటమి రుచి చూడాల్సి వచ్చింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని.. ఎంత భారీ స్కోర్ ఉన్న ఛేజింగ్ చేయాలి అనుకునే శ్రేయస్ ఫార్ములా ఈ సారి ఫెయిల్ అయ్యింది. పటా పటా వికెట్లు పడుతున్న టైమ్ లో సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన కూపర్ కొనొల్లీ సెంచరీ వృధా అయ్యిందనే చెప్పాలి. 

ఇక ఎప్పటిలాగే హైదరాబాద్ 220 కి పైగా స్కోర్ ను కాపాడుకుంది. 220 పైగా స్కోర్ చేసిన ప్రతీ మ్యాచ్ లో SRH గెలిచింది. 11 మ్యాచ్ లలో 220 పైగా స్కోర్ చేస్తే.. 11 సార్లు గెలివడం హైదరాబాద్ టీమ్ కే చెల్లింది. ఈ గెలుపుతో 14 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ప్లేస్ కు చేరుకుంది సన్ రైజర్స్.

భరతం పట్టిన బౌలర్లు:

236 పరుగుల టార్గెట్ తో క్రీజులోకి వచ్చిన పంజాబ్ బ్యాటర్లకు ఆది నుంచే చుక్కలు చూపించారు హైదరాబాద్ బౌలర్లు. 1వ ఓవర్ లాస్ట్ బాల్ కు పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (1)ను పెవిలియన్ కు పంపాడు కెప్టెన్ కమిన్స్ . ఆ తర్వాత రెండో ఓవర్ మొదటి బాల్ కే మరో ఓపెనర్ ప్రభుసిమ్రన్ (3) ను ఔట్ చేశాడు నితీశ్ కుమార్ రెడ్డి. 

రెండు ఓవర్లు పూర్తి కాకముందే ఓపెనర్లు ఔటవ్వడంతో డిఫెన్స్ లో పడిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5) ఔట్ అవ్వడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. 4వ ఓవర్ రెండో బాల్ కు శ్రేయస్ ను పెవిలియన్ కు పంపాడు ఎషన్ మలింగ. ఛేజింగ్ లో ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగల సత్తా ఉన్న శ్రేయస్ ఔటవ్వడంతో హైదరాబాద్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారనే చెప్పాలి. 

ఆ తర్వాత 7వ ఓవర్ 4 వ బాల్ కు శివాంగ్ కుమార్ బౌలింగ్ లో ఆల్ రౌండర్ స్టోయినిస్ 28 (14 బాల్స్ లో 3 ఫోర్లు, 2 సిక్సులు) ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఇక కెప్టెన్ కమిన్స్ మాయాజాలంతో 11.4వ ఓవర్ లో సూర్యాన్ష్​ షెడ్గే (25) అభిషేక్ కు క్యాచ్ ఇచ్చి గ్రౌండ్ బయటికి వెళ్లిపోయాడు. 

కొనొల్లీ ఒంటరి పోరాటం:

పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నా.. కూపర్ కొనొల్లీ ఒంటరి పోరాటం చేశాడు.  టపా టపా వికెట్లు పడుతున్నా  ఎక్కడా తగ్గకుండా పోరాటాన్ని కొనసాగించాడు. 59 బాల్స్ లో 7 ఫోర్లు, 8 సిక్సులతో  సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 107 రన్స్ తో స్టన్నింగ్  సెంచరీతో చెలరేగినా.. పంజాబ్ ను గెలిపించేందుకు కావాల్సిన టైమ్ అప్పటికే అయిపోయింది. పటా పటా వికెట్లు పడుతున్న టైమ్ లో సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన కూపర్ కొనొల్లీ సెంచరీ వృధా అయ్యిందనే చెప్పాలి. కొనొల్లికి తోడుగా మార్కో జాన్సన్ 16 బాల్స్ లో ఒక సిక్స్ తో 19 రన్స్ చేసి పంజాబ్ స్కోర్200 దాటడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక సన్ రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ కమిన్స్, శివాంగ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు. నితీశ్ కుమార్ రెడ్డి, ఎషన్ మలింగ, షాకిబ్ హుస్సైన్ తలా ఒక వికెట్ తీసుకుకన్నారు. 

హైదరాబాద్ ధనాధన్ :

కాటేరమ్మ కొడుకులు.. అనుకున్నట్లుగానే పంజాబ్ ముందు భారీ టార్గెట్ నిర్దేశించారు. వచ్చిన వాళ్లు వచ్చినట్లు బాదుతూ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు హైదరాబాద్ బ్యాటర్లు. టాప్ ఆర్డర్ వీర బాదుడుకు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 రన్స్ చేసింది హైదరాబాద్. 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రేయాస్ సేన.. సన్ రైజర్స్ ను కట్టడి చేయడంలో విఫలమైందనే చెప్పాలి. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 38 (19 బాల్స్ లో 3 ఫోర్లు,3 సిక్సులు), అభిషేక్ శర్మ 35 (13 బంతులలో 2 ఫోర్లు, 4 సిక్సులు) తో పవర్ ప్లేను సద్వినియోగం చేసుకున్నారు. వీళ్లిద్దరి శాభారంభంతో  పవర్ ప్లే (0–6 ఓవర్లు) లో హైదరాబాద్ స్కోర్  79–1 కు చేరుకుంది. 

ఇక 3.3 వ ఓవర్లో ఫెర్గూసన్ బౌలింగ్ లో శ్రేయాస్ కు క్యాచ్ ఇచ్చిన అభిషేక్ ఔటయ్యాడు.  ఆ తర్వాత 6.4 ఓవర్ దగ్గర రెండో వికెట్ కోల్పోయింది సన్ రైజర్స్ హైదరాబాద్.  చాహల్ బౌలింగ్ లో మార్కో జాన్సన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు హెడ్ . 

  • హాఫ్ సెంచరీలతో చెలరేగిన కిషన్, క్లాసెన్:

ఓపెనర్లు ఔటయినా ఇషాన్ కిషన్ , క్లాసెన్ ఇన్నింగ్స్ ఆ ఊపును కొనసాగించారు. హాట్రిక్ సిక్సులతో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇషాన్ కిషన్. 14వ ఓవర్ విజయ్ కుమార్ బౌలింగ్ లో చివరి మూడు  బంతులలో మూడు సిక్సులు బాది ఫిప్టీ మార్క్ అందుకున్నాడు. 29 బంతులలో 52 రన్స్ (2 ఫోర్లు, 4 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించాడు. 14.4 ఓవర్ లో అర్షదీప్ బౌలింగ్ లో సూర్యాన్ష్​ షెడ్జెకి క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరాడు. ఇక క్లాసెన్ తన క్లాసీ ఇన్నింగ్స్ తో హైదరాబాద్ కు భారీ స్కోర్ అందించాడు. 43 బంతులలో 3 ఫోర్లు, 4 సిక్సులతో 69 రన్స్ బాదాడు. 

కిషన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి..  ఎప్పట్లాగే భారీ సిక్సర్లు, ఫోర్లతో స్కోర్ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 13 బాల్స్ లో 29 రన్స్ చేసి భళా అనిపించాడు. మొత్తానికి కాటేరమ్మ కొడుకులు చెలరేగడంతో పంజాబ్ ముందు   ఓవర్లలో 236 రన్స్ భారీ టార్గెట్ నిర్దేశించారు. 

ఇక పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్, ఫెర్గూసన్, చాహల్, విజయ్ కుమార్ వైశాక్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. చాహల్ ఒక్కడే తక్కువ రన్ రేట్ (8) ఇచ్చాడు. పంజాబ్ ఫీల్డింగ్ లో చేసిన పొరపాట్లే హైదరాబాద్ కు కలిసొచ్చాయని చెప్పవచ్చు. ఇషాన్, క్లాసెన్ లాంటి కీలక బ్యాటర్ల క్యాచ్ లు మిస్ చేసుకోవడంతో.. లైఫ్ ను ఉపయోగించుకుని భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు ఈ హైదరాబాదీ బ్యాటర్లు.

©️ VIL Media Pvt Ltd.