
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలను ప్రభుత్వ భవనాలకు తరలించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా రామాయంపేట డిగ్రీ కాలేజీని హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు, వరంగల్ ఈస్ట్‌లో ఉన్న కాలేజీని భూపాలపల్లికి, ములుగులో కొనసాగుతున్న కాలేజీని వర్ధన్నపేటకు మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతి ఏడాది ఈ మూడు ప్రాంతాల్లో ప్రైవేట్ బిల్డింగులకు ప్రభుత్వం రూ.లక్షల్లో అద్దె చెల్లించాల్సి వస్తోంది. అద్దె భారాన్ని తగ్గించేందుకు సొసైటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రామాయంపేట డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం సుమారు 600 మంది విద్యార్థులు చదువుతున్నారు.