
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను వాటర్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు హోంగార్డు సయ్యద్ హుస్సేన్, యువతి అక్షితలుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్ ట్రాఫిక్ పిఎస్‌లో సయ్యద్ హుస్సేన్ హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ తర్వాత పార్ట్‌టైమ్‌గా ర్యాపిడో బైక్ డ్రైవర్‌గా కూడా పని చేస్తున్నాడు.
సోమవారం ఉదయం అక్షిత ర్యాపిడో ద్వారా రైడ్ బుక్ చేసుకొని సయ్యద్ హుస్సేన్ బైక్‌పై బయల్దేరింది. ఈ క్రమంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10 సమీపంలో వెనుక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ ఆ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అక్షితను విజయనగరం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.