Reading Time: < 1 minute

శంషాబాద్ పరిధిలోని శివ శివ శంకరా.. శంభో మహాదేవా అంటూ భక్తులతో కిటకిటలాడాయి.

Caption of Image.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునుంచే ‘ఓం నమః శివాయ’ నామస్మరణతో ఆలయాలు మారుమోగగా, భక్తులు ఉపవాస దీక్షలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలతో శివుడి అనుగ్రహాన్ని పొందారు. శంషాబాద్ పరిధిలోని శ్రీవెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం, కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయాలతో పాటు కుత్బుల్లాపూర్, ముషీరాబాద్ శైవక్షేత్రాలకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లు, ప్రసాద పంపిణీ, హెల్త్​ క్యాంపులు, భద్రతా ఏర్పాట్లు చేశారు. 

కీసరగుట్టలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, నార్సింగి మంచిరేవులలోని మచిలేశ్వర స్వామి ఆలయంలో పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ పూజలు చేశారు. శివపార్వతుల కల్యాణాలు, రాత్రి జాగరణలు, భజనలు, కీర్తనలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. – వెలుగు నెట్​వర్క్

©️ VIL Media Pvt Ltd.