
నార్కట్‌పల్లి: భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ఓ లారీని వెనుక నుంచి అడిషనల్ కలెక్టర్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది.
సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేశారు. ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా? అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ పరిస్థితి ఎలా ఉందనే వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై నార్కట్‌పల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు.