
RBI Bank Holidays October 2026: పండుగల నెల అక్టోబర్ 2026లో దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. దుర్గాపూజ, దసరా, లక్ష్మీపూజ, కర్వా చౌత్ వంటి పండుగలతో పాటు రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాల కారణంగా బ్యాంకు శాఖలు కొన్ని రోజులు మూసి ఉంటాయి. అయితే బ్యాంకు సెలవులు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. పండుగల ఆధారంగా రాష్ట్రం, నగరం, ప్రాంతాన్ని బట్టి సెలవులు మారుతాయి. అందువల్ల బ్రాంచ్‌కు వెళ్లి ముఖ్యమైన పని చేయాలనుకునే వారు ముందుగానే తమ ప్రాంతానికి వర్తించే సెలవును చెక్ చేసుకోవడం మంచిది. RBI బ్యాంకు సెలవుల వ్యవస్థలో ప్రాంతీయ సెలవులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.
అక్టోబర్ 2026లో బ్యాంకులు ఎప్పుడు మూసి ఉంటాయి?
అక్టోబర్ 2 – గాంధీ జయంతి: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 10 – మహాలయ అమావాస్య: బెంగళూరు, కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు. ఇదే రోజు రెండో శనివారం కూడా.
అక్టోబర్ 17 – మహా సప్తమి: అగర్తలాలో బ్యాంకులు మూసి ఉంటాయి.
అక్టోబర్ 19 – దుర్గాపూజ / మహాష్టమి / మహానవమి: అగర్తలా, ఐజ్వాల్, భువనేశ్వర్, చెన్నై, గువాహటి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్‌కతా, పాట్నా, రాంచీ, షిల్లాంగ్ తదితర ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 20 – దసరా / విజయదశమి: గ్యాంగ్‌టక్, ఇంఫాల్ మినహా అనేక ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 21 – విజయదశమి / దుర్గాపూజ: అగర్తలా, బెంగళూరు, గ్యాంగ్‌టక్, గువాహటి, కొచ్చి, కోల్‌కతా, తిరువనంతపురంలో బ్యాంకులు మూసి ఉంటాయి.
అక్టోబర్ 22, 23 – దుర్గాపూజ / దసైన్: గ్యాంగ్‌టక్‌లో వరుసగా రెండు రోజులు బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 24 – నాలుగో శనివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు సాధారణ సెలవులుగా అమల్లో ఉన్నాయి.
అక్టోబర్ 26 – లక్ష్మీపూజ / మహర్షి వాల్మీకి జయంతి / యాక్సెసిబిలిటీ డే: అగర్తలా, చండీగఢ్, జమ్మూ, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 29 – కర్వా చౌత్: సిమ్లాలో బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 31 – సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి: అహ్మదాబాద్‌లో బ్యాంకులకు సెలవు.
ఆదివారాల్లోనూ బ్యాంకులు బంద్
పైన పేర్కొన్న పండుగ సెలవులతో పాటు అక్టోబర్‌లో వచ్చే అన్ని ఆదివారాలు, అలాగే రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకు శాఖలు సాధారణంగా పనిచేయవు. RBI నిబంధనల ప్రకారం రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు పబ్లిక్ హాలిడేలుగా ఉన్నాయి.
డిజిటల్ సేవలు కొనసాగుతాయి
బ్యాంకు శాఖలు సెలవుల్లో మూసి ఉన్నప్పటికీ, చాలా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు. UPI, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు సాధారణంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే ATM ద్వారా నగదు ఉపసంహరణ వంటి సేవలు కూడా సాధారణంగా కొనసాగుతాయి. అయితే క్యాష్ డిపాజిట్, చెక్‌కు సంబంధించిన పనులు, డ్రాఫ్ట్, KYC లేదా ఇతర బ్రాంచ్-ఆధారిత సేవలు అవసరమైతే బ్యాంకు పని చేసే రోజునే వెళ్లడం మంచిది.